జీహెచ్ఎంసీలో ఐటీ ఉద్యోగుల కంటే శానిటేషన్ కార్మికులకే ఎక్కువ జీతాలు.. బీటెక్
Actor ProfileCelebrity

జీహెచ్ఎంసీలో ఐటీ ఉద్యోగుల కంటే శానిటేషన్ కార్మికులకే ఎక్కువ జీతాలు.. బీటెక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జీహెచ్ఎంసీలో ఐటీ ఉద్యోగుల కంటే శానిటేషన్ కార్మికులకే ఎక్కువ జీతాలు.. బీటెక్, ఎంటెక్ చదివినా తక్కువ జీతాలే
Samayam Telugu25 Sept 2026
జీహెచ్ఎంసీలో ఐటీ ఉద్యోగుల కంటే శానిటేషన్ కార్మికులకే ఎక్కువ జీతాలు.. బీటెక్, ఎంటెక్ చదివినా తక్కువ జీతాలే

హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (GHMC) ఐటీ నిపుణుల కొరతను తీర్చేందుకు జారీ చేసిన ఒక టెండర్ నోటిఫికేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగరంలో ఎంతో నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్న వేతనాలు శాశ్వత శానిటేషన్ కార్మికుల జీతాల కంటే చాలా తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. జీహెచ్‌ఎంసీ ఒక సంవత్సరం కాల పరిమితిపై ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 25 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ను నియమించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో ప్రతిపాదించిన పే స్కేల్ ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. హార్డ్‌వేర్ ఇంజనీర్లు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్లు, ప్రోగ్రామర్లు, టీమ్ లీడర్లు, జీఐఎస్ అనలిస్ట్‌లు, వెబ్ డిజైనర్ల వంటి వివిధ విభాగాల నిపుణుల కోసం జీహెచ్‌ఎంసీ దరఖాస్తులను కోరింది. అయితే వీరికి కేటాయించిన వేతనాల వివరాలు గమనిస్తే.. 12 మంది హార్డ్‌వేర్ ఇంజనీర్ల పోస్టులకు నెలకు రూ. 28 వేల చొప్పున వేతనం ప్రతిపాదించారు. కనీసం మూడేళ్ల అనుభవంతో పాటు ఎంటెక్ ఉన్నత విద్యార్హత కలిగిన సీనియర్ జీఐఎస్ అనలిస్ట్‌కు నెలకు రూ. 37 వేలు మాత్రమే చెల్లించనున్నారు. బీటెక్ విద్యార్హతతో పాటు ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల వెబ్ డిజైనర్ పోస్టుకు కేవలం రూ. 42 వేలు వేతనంగా నిర్ణయించారు.ఈ వేతన ప్యాకేజీలను జీహెచ్‌ఎంసీలోని శానిటేషన్ కార్మికుల జీతాలతో పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధుల సమాచారం ప్రకారం.. జీహెచ్‌ఎంసీలో కొత్తగా చేరే శానిటేషన్ కార్మికులకే (ఔట్ సోర్సింగ్ కాకుండా) ప్రారంభంలో నెలకు రూ. 30 వేల నుంచి రూ. 35 వేల వరకు వేతనం అందుతోంది. ఇక కార్పొరేషన్‌లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న సీనియర్ శానిటేషన్ కార్మికులు తమ సర్వీసు కాలాన్ని బట్టి నెలకు రూ. 50 వేల నుంచి గరిష్టంగా రూ. 80 వేల