
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు జాతీయ పతాకానికి వందనం చేస్తున్న మంత్రి నాదెండ్ల, కలెక్టర్ కృతికాశుక్లా, తదితరులు నరసరావుపేట అర్బన్, నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందని, వారి పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగుదామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కలెక్టరేట్ ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో శనివారం 80వ స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు మంత్రి ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనకు కలెెక్టర్ కృతికాశుక్లా, జేసీ సంజనా సింహా, అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వందేమాతరం గీతాన్ని ఆలపించారు. మంత్రి నాదెండ్ల మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. పోలీసు బలగాల పరేడ్‌ను ప్రత్యేక వాహనం నుంచి పరిశీలించారు. పోలీసు, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతిపై సందేశం ఇచ్చారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో మొదటి స్థానం సాధించి మంత్రి మనోహర్ నుంచి బహుమతి అందుకుంటున్న మాచర్ల గిరిజన ఆశ్రమ పాఠశాల, కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూలు విద్యార్థులు రాష్ట్రంలో యువశక్తికి లోటు లేదని, విభిన్న అంశాల్లో శిక్షణ, నైపుణ్యం అందిస్తే అద్భుతాలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 2025లో రూ.3,06,653 కోట్ల పెట్టుబడులు రాగా 2026లో రూ.8,95,113 కోట్లు వచ్చాయన్నారు. జిల్లాలో గత రెండేళ్ల కాలంలో రూ.3431 కోట్ల పెట్టుబడులతో 44 భారీ, మధ్యతరహా పరిశ్రమలు వచ్చాయని, 16,064 మందికి ఉపాధి లభించిందని వివరించారు. సమరయోధుల కుటుంబాలకు సన్మానం.. నరసరావుపేటలో శనివారం నిర్వహించిన వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను, దేశ రక్షణ కోసం అశువులు బాసిన సైనికుల కుటుంబ సభ్యులను మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీˆ శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ కృతికాశుక్లా ఆత్మీయంగా పలకరించి సన్మానించారు. సైనిక