
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Guru Aditya Rajayogam 2026 Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలుసు.. నవగ్రహాలకు రాజుగా పిలిచే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు విశేష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే 2026 జూలై నెలలో ఒక అద్భుతమైన శుభ యోగం ఏర్పడబోతోంది.. అదే గురు ఆదిత్య రాజయోగం.. ఈ యోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవర్‌ఫుల్‌గా భావిస్తారు. ఈ అరుదైన యోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అపారమైన ధనలాభంతో పాటు సమాజంలో గౌరవమర్యాదలు విపరీతంగా పెరగుతాయి. ఆశించిన ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ శక్తివంతమైన యోగం ప్రభావంతో ఏయే రాశులవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. భారత కాలమానం ప్రకారం.. 2026 జూలై 16వ తేదీ ఉదయం 11:44 గంటలకు సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.. ఈ రాశిలో ఇప్పటికే జ్ఞానంతో పాటు సుఖం, అదృష్టానికి సూచికగా భావించే గురు గ్రహం సంచార దశలో కొనసాగుతూ ఉన్నాడు.. మిత్ర గ్రహాలుగా భావించే సూర్యుడితో పాటు బృహస్పతి కలయిక వల్ల ఈ సమయంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది.. ఈ యోగం జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు దాదాపు నెల రోజుల పాటు క్రియాశీలకంగా