
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Abvp calls for Telangana colleges bandh: తెలంగాణలో ప్రస్తుతం ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులపై వివాదం పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, స్కాలర్ షిప్ లను కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దీన్ని సీరియస్ గా తీసుకున్న ఏబీవీపీ జులై 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ఏబీవీపీ ప్రకటించింది. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఇప్పటికే ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఈ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా.. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సైతం దీనిపై ఏబీవీపీ టీయూ కార్యదర్శి సమీర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సకాలంలో ఫీజు విడుదల చేయకపోవడంతో రూ. 11 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రతి ఏటా 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని, వేలాది మంది సర్టిఫికెట్లు తీసుకోలేక పోతురన్నారు. Read more: Harish Rao: రేవంత్ దగ్గర బూతులు తప్ప విషయం లేదు.!. తెలంగాణ సీఎంపై హరీష్ రావు ఖతర్నాక్ పంచ్‌లు.. ప్రైవేటు కాలేజీలు, ప్రభుత్వం దీని వెనుక కుట్రపూరితంగా వ్యహరించి ప్రజల్ని మోసం చేస్తున్నాయని