జానకి పాడితే నటించనన్న సావిత్రి.. ఎందుకో తెలుసా
Actor ProfileActor

జానకి పాడితే నటించనన్న సావిత్రి.. ఎందుకో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జానకి పాడితే నటించనన్న సావిత్రి.. ఎందుకో తెలుసా
Chitrajyothy29 Oct 2026
జానకి పాడితే నటించనన్న సావిత్రి.. ఎందుకో తెలుసా

గాన కోకిల ఎస్. జానకి (S.Janaki) కెరీర్ ప్రారంభ దినాలలో ఆమెకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టిన పాట 'మురిపించే మువ్వలు' చిత్రంలోని 'నీ లీల పాడెద దేవా'. గాన కోకిల ఎస్. జానకి (S.Janaki) కెరీర్ ప్రారంభ దినాలలో ఆమెకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టిన పాట 'మురిపించే మువ్వలు' చిత్రంలోని 'నీ లీల పాడెద దేవా'. ఆ పాట వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఓ ప్రముఖ నటీమణి ఆ పాట జానకి పాడితే తాను నటించనని చెప్పారట. ఆ పాట వెనుక ఉన్న అసలు విషయాన్ని ఎస్. జానకి ఒకానొక సందర్భంగా ఇలా వివరించారు. 'మురిపించే మువ్వలు' చిత్రంలో నేను 'నీ లీల పాడెద దేవా' అనే పాట పాడాను. ఆ పాటకు తమిళ మాతృక అయిన 'సింగార వేళనె దేవా' (కొంజుం సలంగై) దక్షిణదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పాట సంగీత రచనా విధానమంతా ఫక్తు కర్ణాటక ఫక్కీయే అయినా జనాల్లోకి బాగా వచ్చేసింది. ఈ పాట రికార్డు తమిళంలో అయిదువేలకు పైగా అమ్ముడుపోయాయని చెప్పుకున్నారు ఆ రోజుల్లో. రెండు భాషల్లోనూ ఆ పాట నేనే పాడాను. నిజానికి ఆ పాట నా వల్ల గొప్పదేమీ కాలేదు, నేను ఆ పాట వల్ల మరింత పేరు తెచ్చుకుని పరిశ్రమలో స్థిరపడిపోయాను. ఆ పాటలోని ప్రత్యేకతేమైనా చెప్పుకోవాల్సివస్తే సుబ్బయ్యనాయుడు గారి అపార ప్రతిభ గురించి చెప్పుకోవాలి. అంతవరకు నాదస్వరంతో మానవకంఠాన్ని మేళవించటానికి ఎవరూ ప్రయత్నించ సాహసించలేదు. అలాంటి పరిస్థితిలో సుబ్బయ్య నాయుడు గారు అలాంటి మహోత్కృష్ట సృష్టి చేశారంటే అది ఒక విశేష వినూత్న ప్రయోగమే అని చెప్పుకోవచ్చు. అసలా పాట అంత నిర్దుష్టంగా ఉండడానికి ఆయన తీసుకున్న శ్రమ అంతా ఇంతా కాదు. మొదట నాదస్వరవిద్వాన్ కారైకురుచ్చి అరుణాచలంతో రికార్డులో వినబడే నాదస్వర భాగాలన్నీ జాగాలుంచి రికార్డు చేశారు. తర్వాత దాంతోపాటు కంఠాన్ని కలిపి రికార్డు చేయదలిచారట. ఆ శ్రుతిలో