జానకి పాట విని స్టేజ్
Actor ProfileCelebrity

జానకి పాట విని స్టేజ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జానకి పాట విని స్టేజ్ పైనే దీవించిన పి. సుశీల తండ్రి
Chitrajyothy29 Oct 2026
జానకి పాట విని స్టేజ్ పైనే దీవించిన పి. సుశీల తండ్రి

ఇవాళంటే టీవీలో వచ్చే కార్యక్రమాలలో పాటలు పాడేసి చాలామంది సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటారు. కొంతమంది చిన్న వయసులోనే సరిగమలు నేర్చుకుంటున్నారు. అయితే జానకి తరంలో మాత్రం ఎంతో కఠోరశ్రమ చేస్తే తప్పితే సినిమాల్లో అవకాశాలు వచ్చేవి కాదు. ఇవాళంటే టీవీలో వచ్చే కార్యక్రమాలలో పాటలు పాడేసి చాలామంది సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటారు. కొంతమంది చిన్న వయసులోనే సరిగమలు నేర్చుకుంటున్నారు. అయితే జానకి తరంలో మాత్రం ఎంతో కఠోరశ్రమ చేస్తే తప్పితే సినిమాల్లో అవకాశాలు వచ్చేవి కాదు. జానకి (S.Janaki) సుదీర్ఘకాలం సినిమాల్లో గాయనిగా రాణించడానికి బలమైన పునాది స్టేజ్ షో మీద జరిగింది. ఆమె పిన్న వయసులోనే ఎన్నో కచేరీలలో పాటలు పాడారు. ఆ రోజుల్ని తలుచుకుంటూ జానకి ఒకసారి ఇలా తెలిపారు. 'అప్పట్లో రాజమండ్రిలో 'క్రాంతి కళా మండలి' అని ఓ కల్చరల్ యూత్ అసోసియేషన్ వుండేది. దాని నిర్వాహకులు వి.రామచంద్రరావు గారు (సినీ దర్శకులు). ఈ అసోసియేషన్ తరపున సినిమా పాటల కచ్చేరీల్లో నేను పాడేదాన్ని. కాలేజీ ప్రోగ్రామ్స్ తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ పాటలు పాడేదాన్ని. నేను పాడుతుంటే అందరూ రికార్డ్స్ వేశారని అనుకునేవారట. కె.ఎల్.నరసింహారావు, పంపన సూర్యనారాయణగార్లు అప్పట్లో నాతో కలిసి పాడేవారు. మా మ్యూజిక్ ప్రోగ్రామ్ కు చాలా ఎక్కువమంది ప్రేక్షకులు వచ్చేవారు. నాకెందుకో గానీ చిన్నప్పటి నుంచీ కూడా భయమనేది వుండేది కాదు. ఎంతమంది ముందరైనా బిడియం, భయం లేకుండా పాడేసేదాన్ని. అప్పుడే రాయలసీమ కరువు బాధితులకు సహాయం చేయడం కోసం మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కండెక్టు చేసి విరాళాలు సేకరించారు. నేను ఆ బృందంతో కలసి వెళ్లేదాన్ని. ఆ 'క్రాంతి కళామండలి' లోనే ఓ డాన్స్ ట్రూపు కూడా వుండేది. వాళ్ల ప్రదర్శనలకి నేను ప్లేబాక్ పాడేదాన్ని. అలా మ్యూజిక్ ప్రోగ్రాంలకు వెళ్లడం నా గాత్ర శుద్ధికి ఎంతో తోడ్పడింది. ఒకసారి విజయనగరంలో లైట్ మ్యూజిక్ కచేరీ చేస్తూ తెనాలి రామకృష్ణ చిత్రంలో పి.సుశీల గారు