జానీ మాస్టర్ కు ఫిలిం ఫెడరేషన్ షాక్.. నిషేధం కొనసాగింపు
Actor ProfilePolitician

జానీ మాస్టర్ కు ఫిలిం ఫెడరేషన్ షాక్.. నిషేధం కొనసాగింపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జానీ మాస్టర్ కు ఫిలిం ఫెడరేషన్ షాక్.. నిషేధం కొనసాగింపు
AP7AM16 Jan 2027
జానీ మాస్టర్ కు ఫిలిం ఫెడరేషన్ షాక్.. నిషేధం కొనసాగింపు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య (ఫిల్మ ఫెడరేషన్) గట్టి షాక్ ఇచ్చింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సమాఖ్య స్పష్టం చేసింది. బుధవారం జరిగిన ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినందుకే జానీ మాస్టర్‌పై ఈ చర్యలు కొనసాగుతాయని వెల్లడించింది.ఈ సమావేశంలో డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సినీ పెద్దలు, నిర్మాతల మండలి సూచనలను కాదని, ఏకపక్షంగా డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఉప ఎన్నికలు నిర్వహించడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా తప్పుపట్టింది.ఈ పరిణామాల నేపథ్యంలో, ఇకపై డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఎలాంటి సహకారం అందించబోమని ఫెడరేషన్ స్పష్టం చేసింది. అయితే, సామాన్య డ్యాన్సర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. మిగతా 23 క్రాఫ్టులకు మాత్రం యథావిధిగా సహకారం కొనసాగుతుందని పేర్కొంది. అంతేకాకుండా, గతంలో జానీ మాస్టర్ ఫెడరేషన్‌కు ఇచ్చిన రూ. 3 లక్షల మొత్తాన్ని కూడా ఆయనకే తిరిగి పంపిస్తున్నట్లు వెల్లడించింది