జాగర్తండీ బాసులు.. ఏఐ మెరుపు తీగలు
Actor ProfilePolitician

జాగర్తండీ బాసులు.. ఏఐ మెరుపు తీగలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జాగర్తండీ బాసులు.. ఏఐ మెరుపు తీగలు
Andhra Jyothy13 Jan 2027
జాగర్తండీ బాసులు.. ఏఐ మెరుపు తీగలు

డేటింగ్‌ యాప్స్‌లో కల్పిత అమ్మాయిలు నవ్వించి, కవ్వించి లవ్వంటూ వలేస్తారు న్యూడ్‌ చాటింగ్‌ అంటూ ప్రేరేపిస్తారు అక్కడి నుంచి ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభిస్తారు రోజు రోజుకూ పెరిగిపోతున్న బాధితులు.. అప్రమత్తతే దీనికి మందు రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 569 మంది బాధితులు వారి నుంచి రూ.2.81 కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు బాధితుల్లో 61శాతం మంది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే హైదరాబాద్‌ సిటీ: బాగా రీల్స్‌ చూసే అలవాటున్న ఓ యవకుడు ఓ డేటింగ్‌ యాప్‌ ప్రకటన కనబడితే డౌన్‌లోడ్‌ చేసుకొని ఓపెన్‌ చేశాడు. నిమిషాల్లోనే ఓ అమ్మాయి నుంచి మెసేజ్‌ వచ్చింది. సో అండ్‌ సో అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. మాటల సందర్భంగా తన సొంతూరు సమీపంలోని టౌనుకు చెందిన పిల్లనే ఆమె అని అతడు తెలుసుకున్నాడు. ఆ టౌనులో ఫలానా మార్కెట్టు.. ఫలానా కూడలి అంటూ సరిగ్గా వివరాలూ చెప్పడం.. పైగా తన ఫోన్‌ నంబరు ఇవ్వాలని అడగడంతో వెనుకాముందు ఆలోచించకుండా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆమెనే చాటింగ్‌ మొదలు పెట్టింది. ఇద్దరూ మెసేజ్‌లు ఇచ్చిపుచ్చుకుంటుండటంతో అతడికి సమయమే తెలిసేది కాదు. ఒకసారి ఆమే చొరవ తీసుకొని.. ‘‘ఎన్నాళ్లిలా మాటలు? ఒకసారి కలుద్దాం’’ అనేసరికి అతడు మురిసిపోయాడు. కలిసేందుకు ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి ఆమే ఫోన్‌ చేసి.. ‘‘సారీ, మా సమీప బంధువు ఆస్పత్రిలో ఉన్నాడు. అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది’’ అని దాదాపు ఏడుస్తున్న గొంతుతో చెప్పింది. పైగా ‘‘చికిత్స కోసం ఓ యాభై వేలు కావాలి’’ అని ఆమె అడిగితే అతడు ఆన్‌లైన్‌లో పంపాడు. రెండ్రోజులకు ఆమే ఫోన్‌ చేసి.. ‘‘నీ హెల్ప్‌ మరిచిపోలేను’’ అంటూ డబ్బు పంపినందుకు థ్యాంక్స్‌ చెప్పింది. ఆ రోజు రాత్రి అతడికి వీడియో కాల్‌ చేసి మాటల్లో పెట్టి.. ఒంటిపై ఒక్కో వస్త్రాన్ని తొలగిస్తూ పూర్తిగా నగ్నంగా మారింది. అతడినీ