జేఎన్ టీయూలో.. పరిశోధనల
Actor ProfilePolitician

జేఎన్ టీయూలో.. పరిశోధనల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జేఎన్ టీయూలో.. పరిశోధనలపై పట్టింపేదీ
Andhra Jyothy8 Jan 2027
జేఎన్ టీయూలో.. పరిశోధనలపై పట్టింపేదీ

ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ఏడాదిన్నరగా పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ వేయని జేఎన్‌టీయూ హైదరాబాద్‌ సిటీ: ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ప్రతియేటా రెండు పీహెచ్‌డీ నోటిఫికేషన్లను జారీ చేస్తామని వివిధ సందర్భాల్లో వైస్‌ చాన్స్‌లర్‌ చేసిన ప్రకటనలు అధికారుల అలసత్వం కారణంగా అమలుకు నోచుకోవడం లేదని ఆయా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెప్పిన వర్సిటీ ఉన్నతాధికారులు ఆర్నెల్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదని ఆశావహ అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ జారీచేసినా దరఖాస్తుల పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూల పేరిట అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాదికిపైగా అధికారులు సమయం తీసుకుంటుండడం ఆశావహ అభ్యర్థులను తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు గురిచేస్తోంది. పీహెచ్‌డీ ప్రవేశాల నిమిత్తం ఈ ఏడాది (2026) నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారో ఎవరికీ అంతుబట్టడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకొని పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న పలువురు అభ్యర్థులు నోటిఫికేషన్‌ కోసం అడ్మిషన్ల విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీ అఫిలియేటెడ్‌ (ప్రైవేటు) ఇంజనీరింగ్‌ కళాశాలల్లో మూడేళ్ల క్రితమే రీసెర్చ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా కేంద్రాలకు అడ్మిషన్లలో ప్రాధాన్యతను ఇవ్వక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైస్‌ చాన్స్‌లర్‌ కిషన్‌కుమార్‌రెడ్డి.. ఈ ఏడాది ప్రారంభంలో ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో జరిపిన భేటీలో రానున్న నోటిఫికేషన్‌లో ప్రిన్సిపాల్స్‌కు సైతం స్కాలర్స్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, నోటిఫికేషన్‌ జారీపై అటు అర్‌అండ్‌డీ విభాగం నుంచి గానీ, ఇటు అడ్మిషన్ల విభాగం నుంచి గానీ స్పష్టమైన సమాచారం లేకపోవడంతో