చతికిల పడ్డ కొరియన్ కనకరాజు.. వరుణ్ తేజ్ మూవీ టోటల్ ఎంత చేసిందంటే
Actor ProfileActor

చతికిల పడ్డ కొరియన్ కనకరాజు.. వరుణ్ తేజ్ మూవీ టోటల్ ఎంత చేసిందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చతికిల పడ్డ కొరియన్ కనకరాజు.. వరుణ్ తేజ్ మూవీ టోటల్ ఎంత చేసిందంటే
Asianet News Telugu20 Jan 2027
చతికిల పడ్డ కొరియన్ కనకరాజు.. వరుణ్ తేజ్ మూవీ టోటల్ ఎంత చేసిందంటే

వరుణ్‌ తేజ్‌, రితిక నాయక్‌ జంటగా `కొరియన్‌ కనకరాజు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. దీన్ని కామెడీ హర్రర్‌, థ్రిల్లర్‌గా ఆయన రూపొందించారు. సత్య, మురళీధర్‌ గౌడ్‌, సునీల్‌, టెంపర్‌ వంశీ ముఖ్య పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 7న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా 13రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా థియేటర్‌లో రన్‌ అవుతుంది. 13వ రోజు ఎంత కలెక్షన్లని రాబట్టింది, ఇప్పటి వరకు టోటల్‌గా ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. కేవలం రూ.12కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. కాకపోతే పెద్ద స్థాయిలో సినిమా వసూళ్లని కలెక్ట్ చేస్తుందని భావించారు. కానీ ఆ స్థాయిలో చేయలేకపోయింది. వంద కోట్ల వరకు వెళ్లలేకపోయింది. ఈ మూవీ 13 రోజుల్లో మొత్తంగా రూ.31.75కోట్లు రాబట్టింది. బుధవారం దీనికి రూ.25లక్షలు మాత్రమే వచ్చాయి. మంగళవారంతో పోల్చితే మూడు లక్షలు తగ్గాయి. ఇది సినిమా థియేట్రికల్‌ గా క్లోజ్‌ అవుతుందనేదానికి సంకేతంగా చెప్పొచ్చు. మహా అయితే ఈ వారాంతం వరకు ఆడుతుంది. ఆ తర్వాత ఎత్తేయాల్సి వస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా 10 రోజులకే రూ.50కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు మరో కోటి, రెండు కోట్లు యాడ్‌ చేసి ఉంటారు. చిత్ర బృందం అధికారిక లెక్కల ప్రకారం ఇది దాదాపు రూ.52కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లో వెళ్తుంది. ట్రేడ్‌ సైట్ల లెక్కల ప్రకారం దీనికి నాలుగైదు కోట్ల లాభాలు వచ్చి ఉంటాయి. అదే టీమ్‌ లెక్కల ప్రకారం పది కోట్లకుపైగానే లాభాలను రాబట్టిందని చెప్పొచ్చు