శైలు తన నాన్నని ఇంటికి వెళ్లమని.. తాను వస్తానని అంటుంది. చుట్టు పక్కల చేరిన జనాన్ని సైతం వెళ్లమని చెబుతుంది. ఏంటి సినిమా చూస్తున్నారా? వెళ్లండని అంటుంది. ఏంటే.. నాన్నతో అలా మాట్లాడావ్.. అని కేశవ అంటాడు. మరి కూతురితో అలానేనా మాట్లాడేది? అని అంటుంది శైలు. సాయంత్రం ఇంటికి వెళ్తావా? లేదా? అని కేశవ అంటాడు. వెళ్తాను అని శైలు అంటుంది. మరి నీకు భయం లేదా? అని కేశవ అంటే.. ఏముంది మన పెళ్లి చేస్తారు అంతే గా అని శైలు అంటుంది. పెళ్లి చేస్తారా? అని కేశవ షాక్ అవుతాడు. ఇక వెళ్తూ వెళ్తూ కేశవని ప్రేమగా హత్తుకుంటుంది శైలు. ఇక శైలుకి ఏం అవుతుందో అని కంగారు పడుతూ ఇంటికి వస్తాడు కేశ. అందరూ భోజనానికి కూర్చుంటే కేశవ మాత్రం ఆకలిగా లేదని బయటకు వెళ్తాడు. కేశవ కోసం చక్రి వెళ్తాడు. మీరు ఎందుకు వెళ్తున్నారు.. గ్యాప్ దొరికితే గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారా? అని మహా అడుగుతుంది. అవునండి మాకు అదే పని.. గ్యాప్ దొరికితే గొడవ పెట్టుకుంటాం.. మాకు వేపకాయ అంత వెర్రి ఉంది.. అని గట్టిగా అంటాడు చక్రి. దీంతో మహా కాస్త ఫీలైనట్టుగా కనిపించింది. సరే మనం తిందాం అని కన్నా, పెద్దిలతో మహా అంటుంది.ఏం జరిగినా నేను ఉంటా.. కేశవ మూడ్‌ని చూసి ఏమైంది రా అని చక్రి అడుగుతాడు. ఏం కాలేదు అని అబద్దం చెప్తాడు కేశవ. బుస్సు గొడవేనా? అని చక్రి అంటే.. నీకు ఎలా తెలిసింది రా అని కేశవ అంటాడు. నేను కూడా ఓ భగ్న ప్రేమికుడ్నే కదరా.. అని చక్రి అంటాడు. ఇక జరిగిన విషయం అంతా చెప్తాడు. ప్రేమలో పడ్డందుకు కంగ్రాట్స్.. ఇక కష్టాలు మొదలు అని చక్రి అంటాడు. వాళ్ల నాన్నకి తెలిసిపోయింది రా అని మళ్లీ జరిగిందంతా చెప్తాడు. అంటే ఆ
Actor ProfileCelebrity
చచ్చినా ఇంకొకర్ని పెళ్లి చేసుకునో.. కేశవనే చేసుకుంటా.. తెగేసి చెప్పిన శైలు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•24 Sept 2026
చచ్చినా ఇంకొకర్ని పెళ్లి చేసుకునో.. కేశవనే చేసుకుంటా.. తెగేసి చెప్పిన శైలు