చిరంజీవి హాలివుడ్ చిత్రం ప్రారంభమై కూడా ఎందుకు ఆగిపోయింది
Actor ProfileActor

చిరంజీవి హాలివుడ్ చిత్రం ప్రారంభమై కూడా ఎందుకు ఆగిపోయింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిరంజీవి హాలివుడ్ చిత్రం ప్రారంభమై కూడా ఎందుకు ఆగిపోయింది
TV9 Telugu1 Nov 2026
చిరంజీవి హాలివుడ్ చిత్రం ప్రారంభమై కూడా ఎందుకు ఆగిపోయింది

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో పలు సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. వాటిలో ఒకటి కాదు, ఐదు చిత్రాలున్నాయి. అయితే, అన్నింటిలోకి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఆయన హాలీవుడ్ చిత్రం ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్. ఒక తెలుగు హీరో హాలీవుడ్ చిత్రంలో నటించడం అరుదైన విషయమే. అలాంటి అవకాశం 25 ఏళ్ల ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవికి లభించింది. చలనచిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయం సృష్టిస్తుందని అందరూ భావించిన ఈ హాలీవుడ్ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోవడం దురదృష్టకరం. అమెరికాలో స్థిరపడిన కె. రమేష్ కృష్ణమూర్తి, సుందరస్వామి, గణేష్ మహాదేవన్ అనే ముగ్గురు భారతీయులకు ఈ చిత్ర నిర్మాణం ఆలోచన వచ్చింది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో, మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 43 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆంగ్ల చిత్రాన్ని నిర్మించాలని ఈ నిర్మాతల త్రయం సంకల్పించింది. 1940లో వచ్చిన ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం నాటి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఆ సినిమాకు ఆధునిక సాంకేతిక విలువలు జోడించి ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రాన్ని నిర్మించాలని, నిర్మాతలు భారీ ప్రణాళికలతో అడుగు ముందుకు వేశారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు. తెలుగు వెర్షన్‌కు అబూ బాగ్దాద్ గజదొంగగా టైటిల్ ఖరారు చేశారు. హాలీవుడ్ దర్శకుడు డచన్ గెర్సీని ఆంగ్ల వెర్షన్‌కు, సురేష్ కృష్ణను తెలుగు వెర్షన్‌కు దర్శకులుగా ఎంపిక చేసుకున్నారు. 90 నుంచి 100 నిమిషాల నిడివితో ఇంగ్లీష్ వెర్షన్‌ను, రెండున్నర గంటల నిడివితో తెలుగు వెర్షన్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ వెర్షన్‌లో పాటలు ఉండవు. అయితే, తెలుగు వెర్షన్‌లో మాత్రం ఐదు పాటలు, కామెడీ సీన్లు ఉండాలని, దీన్ని తమిళ, హిందీ భాషల్లోకి డబ్ చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రూపొందించారు. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్‌ను ఎన్నుకున్నారు. ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం విడుదలై