చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
Actor ProfileCelebrity

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
TV9 Telugu24 Dec 2026
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ

‘చెఫ్ మంత్ర ప్రాజెక్టు యూఎస్ఏ ’తో తెలుగు వినోదాన్ని భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరిస్తోంది ఆహా. తొలి తెలుగు అంతర్జాతీయ నాన్-ఫిక్షన్ షోగా రూపొందిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతోంది. అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన ఈ షోలో యూఎస్ఏకు చెందిన ఐదుగురు కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. ఫుడ్, కల్చర్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, కలగలిపిన ఈ కార్యక్రమం భారత్‌లోని తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఇది కూడా చదవండి : ఏంటీ.. ఈవిడా ఆమె ఒక్కరేనా..!! ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ బ్యూటీ ఈ అమ్మడు 'చెఫ్ మంత్ర ప్రాజెక్టు యూఎస్ఏ ’లో ప్రధానంగా అమెరికాలో తెలుగు వంటకాలు, వాటి ప్రత్యేకతను సెలబ్రేట్ చేస్తున్నారు. మనకు సుపరిచితమైన రుచులు, వంటకాల సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేస్తోంది. యూఎస్ఏకు చెందిన ఐదుగురు కంటెస్టెంట్లను పార్టిసిపేట్ చేస్తూ, ఫుడ్ రిలేటెడ్ ఛాలెంజ్‌లు, పరస్పర సంభాషణలు, వారి వ్యక్తిగత అనుభవాలు, వారి జర్నీ ద్వారా కార్యక్రమాన్ని అత్యంత ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. దీంతో వినోదంతో పాటు భావోద్వేగాలకు కూడా ఈ షోలో ప్రాధాన్యం లభిస్తోంది. ఇది కూడా చదవండి : దొరికేసింది మావ..! అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా.. సుమ కనకాల ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులతో ఆమెకు ఉన్న రిలేషన్, ప్రత్యేకమైన హోస్టింగ్ శైలి షోకు మరింత వినోదాన్ని జోడిస్తోంది. తెలుగు వినోదాన్ని మరింత విస్తృత పరిధిలోకి తీసుకెళ్లేందుకు, లోకల్ కంటెంట్‌కు ఉన్న సాంప్రదాయ సరిహద్దులను దాటి మనవారికి అందించాలని ఆహా చేస్తున్న ప్రయత్నాల్లో ఈ కార్యక్రమం పెద్ద ముందడుగుగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైన తెలుగు వంటకాలు, సంస్కృతిని అంతర్జాతీయ నేపథ్యంతో మేళవించడం ద్వారా ‘చెఫ్ మంత్ర ప్రాజెక్టు యూఎస్ఏ ’ స్థానిక సాంస్కృతిక అనుబంధాన్ని, గ్లోబల్ ప్రాతినిధ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ముఖ్యంగా అమెరికాతో అనుబంధం ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఈ