చైనా అరుదైన క్షిపణి పరీక్ష.. ఉలిక్కిపడిన అమెరికా
Actor ProfileCelebrity

చైనా అరుదైన క్షిపణి పరీక్ష.. ఉలిక్కిపడిన అమెరికా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చైనా అరుదైన క్షిపణి పరీక్ష.. ఉలిక్కిపడిన అమెరికా, మిత్రదేశాలు.. జలాంతర్గామి నుంచి మిస్సైల్ టెస్ట్ ఎందుకు కీలకం
Samayam Telugu3 Oct 2026
చైనా అరుదైన క్షిపణి పరీక్ష.. ఉలిక్కిపడిన అమెరికా, మిత్రదేశాలు.. జలాంతర్గామి నుంచి మిస్సైల్ టెస్ట్ ఎందుకు కీలకం

చైనా ఇటీవల న్యూక్లియర్ సబ్‌మెరైన్ నుంచి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించింది. డమ్మీ వార్ హెడ్‌తో ఈ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు చైనాకు చెందిన జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కేవలం భూమి మీది నుంచి మాత్రమే కాకుండా.. సముద్ర గర్భం నుంచి సైతం భూమ్మీద ఎక్కడైనా అణు దాడి చేయగల సామర్థ్యం తనకు ఉందని ఈ క్షిపణి ప్రయోగం ద్వారా చైనా ప్రపంచానికి చాటింది. దీంతో పసిఫిక్ మహాసముద్ర జలాల్లోకి చైనా చేపట్టిన అరుదైన ఈ ప్రయోగం అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలను కలవరానికి గురి చేసింది. చైనా చివరగా రెండేళ్ల క్రితం పసిఫిక్ జలాల్లో ఓ డమ్మీ వార్ హెడ్‌తో మిస్సైల్ టెస్ట్ చేపట్టింది. 1980 తర్వాత చైనా పసిఫిక్ జలాల్లో క్షిపణి ప్రయోగం చేపట్టడం అదే తొలిసారి.జులై 6న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు చైనా నేవీ ఈ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను పసిఫిక్ మహా సముద్రంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి పరీక్షించింది. ఈ క్షిపణి తన ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ జిన్హువా రిపోర్టు పేర్కొంది. చైనా సైన్యం వార్షిక శిక్షణలో భాగంగా ముందే నిర్ణయించిన ప్రకారం ఈ క్షిపణిని ప్రయోగించిందని.. ఇది ఏ దేశాన్ని లేదా సైనిక లక్ష్యాన్ని ఉద్దేశించి చేపట్టిన ప్రయోగం కాదని చైనా స్పష్టం చేసింది.అమెరికాను తాకే సామర్థ్యం..చైనా దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణి అయిన జేఎల్-3 సబ్‌మెరైన్ లాంచ్‌డ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఈ క్షిపణి ప్రయోగంలో వాడి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది నిర్వహించిన మిలటరీ పరేడ్‌లో తొలిసారి ఈ క్షిపణిని డ్రాగన్ ప్రదర్శనకు ఉంచింది. చైనా తీరంలోని సముద్ర జలాల నుంచి ప్రయోగించినా సరే అమెరికాను తాకే సామర్థ్యం ఈ ఖండాతర క్షిపణికి ఉంది. దీంతో