చిక్కుల్లో రాహుల్ సిప్లిగంజ్.. విశాఖలో కలకలం
Actor ProfileCelebrity

చిక్కుల్లో రాహుల్ సిప్లిగంజ్.. విశాఖలో కలకలం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిక్కుల్లో రాహుల్ సిప్లిగంజ్.. విశాఖలో కలకలం
Chitrajyothy1 Dec 2026
చిక్కుల్లో రాహుల్ సిప్లిగంజ్.. విశాఖలో కలకలం

బిగ్ బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌పై (Singer Rahul Sipligunj) విశాఖలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బిగ్ బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌పై (Singer Rahul Sipligunj) విశాఖలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆయనతోపాటు మరో 15 మందిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు ఎంవీపీ కాలనీ పోలీసులు బదిలీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డిపై బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బెదిరింపులు, పరువు నష్టం, దొంగతనంతోపాటు తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆ ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఈ కేసులో అడ్వకేట్ గీతా ప్రసన్న చందన, ఆమె భర్త శివ నారాయణ, జర్నలిస్టులు నరేష్, ఉదయ్‌, సాయిరాంతోపాటు సువర్ణ, హరిణ్య రెడ్డి, కార్తీక్, కేఆర్ రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు 2026 మార్చి 10వ తేదీన కేవలం రాహుల్ రెడ్డిపై మాత్రమే విశాఖ పోలీస్ కమిషనర్‌కు యువతి ఫిర్యాదు చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత జూన్ 11వ తేదీన మరో 11 మంది పేర్లను చేర్చుతూ రెండో ఫిర్యాదు యువతి ఇచ్చింది. దీనిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ రెడ్డి నుంచి బాధితురాలు రూ. కోటి డిమాండ్ నెరవేరక పోవడంతోనే ఈ ఫిర్యాదు చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మూడు నెలల్లో నిందితుల సంఖ్య పెరగడంతోపాటు ప్రముఖుల పేర్లు వినిపించడంతో.. పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాహుల్ రెడ్డి నుంచి రూ.కోటి డిమాండ్ చేసినట్లు, ఆ డిమాండ్ నెరవేరకపోవడంతోనే ఫిర్యాదు చేసినట్లు మరో వర్గం ఆరోపిస్తున్నట్లు సమాచారం