ఘట్కేసర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థిని మృతి
Actor ProfilePolitician

ఘట్కేసర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థిని మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఘట్కేసర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థిని మృతి
Andhra Jyothy25 Dec 2026
ఘట్కేసర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌ శివారులోని ఘట్కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇంటర్‌ విద్యార్థిని శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్‌: ఘట్కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వందన హోటల్‌ సమీపంలో స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఓ ఇంటర్‌ విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన సురేష్‌ తన భార్య, కుమార్తె శ్రావణితో కలిసి స్కూటీపై సొంత గ్రామానికి వెళ్తున్నారు. వందన హోటల్‌ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ వారి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో శ్రావణి రోడ్డుపై పడిపోగా.. ఆమెపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు ఇంటర్‌ చదువుతున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఘట్కేసర్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి.. నిరుపేదలకు రేషన్ కార్డుల్లో విప్లవాత్మక మార్పులు: మంత్రి ఉత్తమ్ కుమార్