గర్ల్స్ హాస్టల్ గదిలో విషాదం.. పడుకున్న నలుగురు విద్యార్థుల్ని కాటేసిన పాము..ఒకరు మృతి
Actor ProfilePolitician

గర్ల్స్ హాస్టల్ గదిలో విషాదం.. పడుకున్న నలుగురు విద్యార్థుల్ని కాటేసిన పాము..ఒకరు మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గర్ల్స్ హాస్టల్ గదిలో విషాదం.. పడుకున్న నలుగురు విద్యార్థుల్ని కాటేసిన పాము..ఒకరు మృతి
Zee Telugu16 Oct 2026
గర్ల్స్ హాస్టల్ గదిలో విషాదం.. పడుకున్న నలుగురు విద్యార్థుల్ని కాటేసిన పాము..ఒకరు మృతి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Krait In Jharkhand Girl Hostel: జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో ఉన్న ఒక రెసిడెన్షియల్ పాఠశాల బాలికల హాస్టల్‌లో ఘోరం చోటు చేసుకుంది. వసతి గృహంలో రాత్రి నిద్రిస్తున్న విద్యార్థినుల గదిలోకి విషపూరితమైన కట్లపాము (krait) ప్రవేశించింది. నిద్రిస్తున్న అమ్మాయిల్లో నలుగురిని ఈ పాము కాటేసింది. అందులో 12 ఏళ్ల బాలిక మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఆ గదిలోకి పాము ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందంటే? జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లో ఈ ఘోరం జరిగింది. రాత్రి పూట విద్యార్థినులు నిద్రిస్తున్న వేళ అనుకోకుండా కట్లపాము గదిలోకి ప్రవేశించినట్లు సహా విద్యార్థినులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలిక మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చేరారని పోలీసులు గురువారం వెల్లడించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి కురు పోలీస్ స్టేషన్ పరిధిలోని రోచో మహువాటోలిలో ఉన్న 'సన్వాసిర హైయర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్'లో జరిగింది. "పాము నలుగురు విద్యార్థినులను కాటేసింది, వారిలో ఒకరు మరణించారు. ఇద్దరు విద్యార్థినులు లోహర్‌దగా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరొకరిని రాంచీలోని రిమ్స్ (RIMS)కు తరలించారు" అని కురు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజిత్ కుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి భోజనం తర్వాత విద్యార్థినులు గ్రౌండ్ ఫ్లోర్‌లోని తమ హాస్టల్ గదికి వెళ్లారని పాఠశాల ప్రతినిధి ఒకరు చెప్పారు. "ఏడుగురు విద్యార్థినులు నిద్రిస్తున్న గదిలోకి 'క్రైట్' (కట్లపాము) పాము ప్రవేశించి