గ్లోబల్ స్టేజ్
Actor ProfileActor

గ్లోబల్ స్టేజ్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
గ్లోబల్ స్టేజ్ పై జక్కన్న’ గర్జన... ఫ్రాన్స్ లో దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం
Samayam Telugu11 Aug 2026
గ్లోబల్ స్టేజ్ పై జక్కన్న’ గర్జన... ఫ్రాన్స్ లో దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి అగ్రస్థానంలో నిలుస్తారు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేని ఏకైక అపజయమెరుగని దర్శకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. రాజమౌళి సినిమా రూపకల్పనకు సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ, అది వెండితెరపైకి వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే జక్కన్న ఖాతాలో మరో అంతర్జాతీయ స్థాయి అరుదైన గౌరవం చేరింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాజమౌళిని అక్కడి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అత్యున్నత రీతిలో సత్కరించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత 'సినెమాథెక్ ఫ్రాన్సైస్‌' (Cinémathèque Française) సంస్థకు చెందిన చారిత్రక హెన్రీ లాంగ్లోయిస్ హాల్‌లో రాజమౌళి పేరిట ఒక 'శాశ్వత సీటు'ను కేటాయించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, దిగ్గజ ఫ్రెంచ్ దర్శకుడు కోస్టా గావ్రాస్ ఆధ్వర్యంలో జక్కన్నకు ఈ అరుదైన గౌరవాన్ని అందించారు. ఈ చారిత్రక సంస్థలో రాజమౌళి రూపొందించిన చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం.* రోజుకి లక్ష రూపాయలా?... టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ క్రేజ్! ఉద్వేగానికి లోనైన రాజమౌళితనకు దక్కిన ఈ అసాధారణ గౌరవంపై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. " పారిస్ నగరంలో నా సినిమాలను ప్రదర్శించడమే కాకుండా, నన్ను ఇక్కడికి ఆహ్వానించడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అయితే, హెన్రీ లాంగ్లోయిస్ హాల్‌లో నా పేరిట శాశ్వత స్థానాన్ని కల్పించడం నేను అస్సలు ఊహించని ఒక మధురమైన ఆశ్చర్యం. ఈ అనుభూతిని మాటల్లో వ్యక్తపరచడం నా వల్ల కావడం లేదు" అని పేర్కొన్నారు. ప్రపంచ సినిమా చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలో తనకు చోటు దక్కడం జీవితాంతం గుర్తుండిపోతుందని, భారతీయ సినిమాపై ఎంతో ఆదరణ చూపిన లెజెండరీ

ప్రభాస్ డార్లింగ్ లుక్ బాహుబలి యానిమేషన్ తో గ్లోబల్ స్టేజ్ పై వైరల్ పోస్టర్
SkyC Media6 Jul 2026
ప్రభాస్ డార్లింగ్ లుక్ బాహుబలి యానిమేషన్ తో గ్లోబల్ స్టేజ్ పై వైరల్ పోస్టర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. బాహుబలి ఫ్రాంచైజీ నుంచి వస్తున్న కొత్త యానిమేషన్ ప్రాజెక్ట్ 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన రిలీజ్ చేశారు