గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా తెలంగాణ.. హైదరాబాద్ లో క్యాంపస్ లు పెట్టనున్న 15 విదేశీ వర్సిటీలు
Actor ProfilePolitician

గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా తెలంగాణ.. హైదరాబాద్ లో క్యాంపస్ లు పెట్టనున్న 15 విదేశీ వర్సిటీలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా తెలంగాణ.. హైదరాబాద్ లో క్యాంపస్ లు పెట్టనున్న 15 విదేశీ వర్సిటీలు
Samayam Telugu1 Oct 2026
గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా తెలంగాణ.. హైదరాబాద్ లో క్యాంపస్ లు పెట్టనున్న 15 విదేశీ వర్సిటీలు

ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ రంగాల్లో అంతర్జాతీయంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరం త్వరలోనే అంతర్జాతీయ ఉన్నత విద్యా రంగానికి కూడా గ్లోబల్ హబ్‌గా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020తో పాటు, యూజీసీ ప్రకటించిన నూతన సడలింపులు భారత్‌లో విదేశీ వర్సిటీల ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేశాయి. ఈ అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుంటూ వివిధ దేశాలకు చెందిన సుమారు 15 ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి క్యూ కడుతున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఉన్న అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు, నివాసయోగ్యమైన వాతావరణం అంతర్జాతీయ సంస్థలను ఇటువైపు ఆకర్షిస్తున్నాయి.ఇప్పటికే ఈ ప్రక్రియలో భాగంగా అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, యూకేకు చెందిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ లండన్ తమ క్యాంపస్‌ల ఏర్పాటు కోసం యూజీసీకి అధికారికంగా దరఖాస్తులు కూడా చేసుకున్నాయి. ప్రస్తుతానికి ఈ విశ్వవిద్యాలయాలన్నీ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే స్వతంత్ర ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఒక ప్రముఖ వర్సిటీ వచ్చే విద్యాసంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని ఒక భారీ కమర్షియల్ టవర్‌లో కొన్ని అంతస్తులను లీజుకు తీసుకునేందుకు ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరుపుతోంది. తాత్కాలికంగా ఇక్కడ ప్రారంభించి భవిష్యత్తులో ప్రయోగశాలలు, స్పోర్ట్స్ అకాడమీలతో కూడిన శాశ్వత క్యాంపస్‌ల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.మరికొన్ని టాప్ వర్సిటీలు కూడా క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికాకు చెందిన పర్డ్యూ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రాథమిక సంప్రదింపులు పూర్తి చేశారు. అదేవిధంగా.. యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రత్యేకంగా క్రీడలు, స్పోర్ట్స్ సైన్స్‌కు సంబంధించిన స్పెషలైజ్డ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి