గులాబీ గూటి రచ్చ.. సొంత బిడ్డే’ ఆయుధమైతే
Actor ProfilePolitician

గులాబీ గూటి రచ్చ.. సొంత బిడ్డే’ ఆయుధమైతే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గులాబీ గూటి రచ్చ.. సొంత బిడ్డే’ ఆయుధమైతే
Telugu Times22 Oct 2026
గులాబీ గూటి రచ్చ.. సొంత బిడ్డే’ ఆయుధమైతే

తెలంగాణ రాజకీయాల్లో గులాబీ గూటి పంచాయితీ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. నిన్నమొన్నటి వరకు కేవలం అంతర్గత విభేదాలుగా భావించిన వ్యవహారం, ఇప్పుడు ఏకంగా పార్టీ మూలాలనే కదిలించే స్థాయికి చేరింది. సొంతంగా ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ పెట్టుకున్న కల్వకుంట్ల కవిత, ఇప్పుడు BRS అగ్ర నాయకత్వంపై, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా చేస్తున్న ఆరోపణలు రాజకీయ గీతల్ని దాటిపోతున్నాయి. నిన్నటి వరకు రాజకీయ విమర్శలకే పరిమితమైన కవిత.. ఈసారి నేరుగా బీఆర్ఎస్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న పార్టీ ఫండ్, క్విడ్ ప్రో కో వ్యవహారాలను వీధిలోకి లాగడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ ను బద్నాం చేయడంలో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకంటే కవిత పాత్రే ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికార కాలంలో కూడబెట్టిన 1400 కోట్ల నిధులపై కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ప్రజల సొమ్మును గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని, దానికి ప్రతిఫలంగా ఆ కాంట్రాక్టర్ల నుండి భారీగా కమిషన్లు వసూలు చేసి బీఆర్ఎస్ పార్టీ ఫండ్‌గా మార్చారని ఆమె నేరుగానే ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ అధినాయకత్వంపైనే, అది కూడా క్విడ్ ప్రో కో కోణంలో ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక మూలాలపై దాడి చేయడం సాధారణ విషయం కాదు. గతంలో కేసీఆర్ అవినీతి రహిత పాలన అందించారని చెప్పుకునే గులాబీ శ్రేణులకు ఇప్పుడు ఈ ఆరోపణలు మింగుడుపడటం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఒక సొంత విమానాన్ని కొనుగోలు చేసిందనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఆ వివాదం అలా ఉంచితే, తాజాగా జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘ది పయనీర్’ ను కూడా పార్టీ నిధులతోనే కొనుగోలు చేశారంటూ కవిత సరికొత్త బాంబు పేల్చారు. తనను పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసి.. వందల కోట్ల పార్టీ ధనాన్ని