గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖి
Actor ProfilePolitician

గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
Sakshi28 Dec 2026
గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్

తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్‌ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిపరీక్ష పేరుతో జరుగుతోన్న సెలెక్షన్‌ ప్రాసెస్‌లో ఎంతోమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు పాల్గొన్నారు. వీరందరినీ వడపోసి ఫైనల్‌కు ఓ 15 మందిని ఎంపిక చేశారు. మొత్తం 55 మంది ఎలిమినేట్ చేయగా.. వీరిలో ఉప్పల్ బాలు కూడా ఉన్నారు. తనకు అన్యాయం చేశాడంటూ నవదీప్‌పై ఫైరవుతున్నాడు. తాజాగా ఈ షో యాంకర్‌ శ్రీముఖి తీరుపై విమర్శలొస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏ చేసింది? ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలుసుకుందాం. అయితే ఇదే బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో మరో సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్‌ రన్నింగ్ రాజా కూడా పాల్గొన్నారు. బిగ్‌బాస్‌ ఛాన్స్‌ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి వచ్చాడు. అయితే టాస్క్‌లో భాగంగా అతను శ్రీముఖిని ఇమిటేట్ చేసేందుకు యత్నించాడు. శ్రీముఖి మేకప్ ఇలా వేసుకుంటుందని తన హావాభావాలతో చూపించాడు. అదే సమయంలో శ్రీముఖి దగ్గరికీ రన్నింగ్ రాజా వెళ్లాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నన్ను టచ్ చేస్తే చెంప పగలగొడతా అంటూ ఆమె దురుసుగా ప్రవర్తించింది. దీంతో శ్రీముఖి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మా ఊర్లో గొర్రెలు కాయడానికి కూడా శ్రీముఖి పనికిరాదంటూ ట్రోల్ చేస్తున్నారు. పల్లెటూరి వాళ్లను షోలకు పిలిచి అవమానించడమే వీళ్ల పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనలాంటి పల్లెటూరి వాళ్లను స్టేజీల మీదకు తీసుకెళ్లి బకరాలను చేస్తారని ఆవేదన చెందుతున్నారు. ఏదేమైనా ఇదంతా షోలో భాగమైతే ఓకే కానీ.. గ్రామీణ ప్రాంతాల ప్రజల టాలెంట్‌ను మాత్రం హేళన చేస్తే సరికాదని మరికొందరు అంటున్నారు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా