గ్రాఫిక్స్ బాగా వస్తే దసరా బరిలో దిగుతారట
Actor ProfileActor

గ్రాఫిక్స్ బాగా వస్తే దసరా బరిలో దిగుతారట

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రాఫిక్స్ బాగా వస్తే దసరా బరిలో దిగుతారట - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema6 Jan 2027
గ్రాఫిక్స్ బాగా వస్తే దసరా బరిలో దిగుతారట - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కుతోంది ‘వృషకర్మ’ (Vrushakarma) సినిమా. సినిమా షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చేసింది. కానీ యూనిట్ మాత్రం ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. దీనికి గల కారణాన్ని బయటపెట్టాడు దర్శకుడు కార్తీక్ దండు. ఫాంటసీ-థ్రిల్లర్ కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్ వర్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే విజువల్ ఎఫెక్టుల కోసం కంటెంట్ ఇచ్చేశారు. కానీ ఆ కంపెనీలు ఇంకా డెలివరీ చేయలేదు. అవి వచ్చిన తర్వాత ఎలాగూ కరెక్షన్లు ఉంటాయి. సో.. ఈలోగా రిలీజ్ డేట్ ఇస్తే, గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందనేది దర్శకుడి ఆలోచన. అందుకే విడుదల తేదీ ప్రకటించలేదంటున్నాడు కార్తీక్. అయితే సినిమాను దసరా బరిలో నిలిపేందుకు 90 శాతం అవకాశాలున్నాయని మాత్రం చెప్పుకొచ్చాడు. ప్రాచీన కాలపు రహస్యాలు, ఎవరికీ తెలియని పురాణ నేపథ్యం, దాగివున్న నిధులు-శక్తులు, వాటి చుట్టూ తిరిగే మిస్టరీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తోంది.అజనీశ్ లోక్ నాధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు