రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వీలుగా ఫోన్ బాక్సులను బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం స్మార్ట్ కార్డులను కూడా మంజూరు చేస్తున్నారు. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఇప్పటి వరకూ కుటంబ సభ్యులతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులానికి రావడమో.. లేదా అక్కడ పనిచేసే సిబ్బందిని బతిమలాడుకుని వారి సాయంతో ఇంట్లోని వారికి ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి ఉండేది. దీంతో పిల్లలు మానసికంగా ఇబ్బంది పడేవారు.ఈ పరిస్థితులలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్న ఏపీ ప్రభుత్వం.. గురుకులాల్లోని విద్యార్థుల కోసం ఫోన్ బాక్సులను ఏర్పాటు చేయిస్తోంది. విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు.. స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నారు. విద్యార్థి పేరు మీద ఈ స్మార్ట్ కార్డులను మంజూరు చేస్తారు. విద్యార్థులు ఈ స్మార్ట్ కార్డులకు రీఛార్జి చేసుకుని.. ఫోన్ బాక్సుల సాయంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. అలాగే ఈ స్మా్ర్ట్ కార్డులు దుర్వినియోగం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లతో మ్యాపింగ్ చేస్తారు. ఇక ఈ ఫోన్ బాక్సుల ద్వారా కేవలం ఔట్ గోయింగ్ కాల్స్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. గురుకులాల్లో చదివే ప్రతి వందమంది విద్యార్థులకు ఓ ఫోన్ బాక్సు కేటాయించారు. విద్యార్థుల సంఖ్యను అనుసరించి గురుకులాల్లో ఈ ఫోన్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు.మరోవైపు విద్యార్థుల చదువుకు ఈ ఫోన్ బాక్సుల ద్వారా అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఉదయం తరగతులు ప్రారంభం కావడానికి ముందు ఓ గంట.. తరగతులు పూర్తి అయిన తర్వాత సాయంత్రం ఓ గంట ఫోన్ బాక్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అలాగే కేవలం ఐదు నంబర్లకు మాత్రమే
Actor ProfilePolitician
గురుకులాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్మార్ట్ కార్డులు జారీ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•22 Nov 2026
గురుకులాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్మార్ట్ కార్డులు జారీ