గుడ్ న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. కానీ
Actor ProfilePolitician

గుడ్ న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. కానీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గుడ్ న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. కానీ, ఇలా చేయాలి..! సరికొత్త స్కీమ్
10TV Telugu8 Dec 2026
గుడ్ న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. కానీ, ఇలా చేయాలి..! సరికొత్త స్కీమ్

Gas Booking : పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లో, సిలిండర్ల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది. అంతేకాక.. గతంలో ఉదయం గ్యాస్ బుక్ చేస్తే సాయంత్రం లేదంటే మరుసటిరోజు ఉదయం ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేది. కానీ, ప్రస్తుతం గ్యాస్ బుక్ చేసిన సమయం నుంచి రెండుమూడు రోజులైనా సిలిండర్ ఇంటికి డెలివరీ కావడం లేదు. దీంతో గ్యాస్ వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులకు స్వస్తి చెబుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ఓ ఆసక్తికర స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇండియన్ ఆయిల్ ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ (Indane XTRALITE NOW) అనే కొత్త సర్వీసును ప్రారంభించింది. దీనిద్వారా కస్టమర్లు బుక్ చేసిన మూడు లేదా నాలుగు గంటల్లోనే 10కిలోల కాంపోజిట్ సిలిండర్ ఇంటికి డెలివరీ అవుతుంది. అయితే, కొత్త కనెక్షన్ కోసం ఎక్కువ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. ‘IndianOil One’ యాప్ ద్వారా లేదంటే ఇండియన్ ఆయిల్ కస్టమర్ పోర్టల్ లేదా 7588888824 వాట్సాప్ నంబర్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. గృహిణులు చాలామంది గ్యాస్ అయిపోయిన వెంటనే కొత్త గ్యాస్ సిలిండర్‌కోసం బుక్ చేస్తారు.. ఇటీవల కాలంలో రెండుమూడు రోజులైనా గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ అనే కొత్త సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్లో అదనపు సిలిండర్ లేకపోయినా మూడు నాలుగు గంటల్లో కొత్త కాంపోజిట్ సిలిండర్ మీ ఇంటికి వస్తుంది. ఇది బరువు తక్కువగా ఉండటంతో మోయడం కూడా తేలిక. వేగంగా కస్టమర్లకు డెలివరీ అందించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇండేన్ ఎక్స్ ట్రాలైట్ నౌ తత్కాల్ సేవ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం