గెట్ అవుట్
Actor ProfilePolitician

గెట్ అవుట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గెట్ అవుట్, ఆరు నెలల్లోనే 3,300 మంది ఇంటికి
Oneindia Telugu20 Nov 2026
గెట్ అవుట్, ఆరు నెలల్లోనే 3,300 మంది ఇంటికి

విదేశాల్లో స్థిరపడి భవిష్యత్తును దిద్దుకుందామని ఎన్నో ఆశలతో కెనడా విమానమెక్కిన వేలాది మంది భారతీయుల కలలు కల్లలవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉక్కుపాదం కారణంగా మనవాళ్లకు డిపోర్టేషన్ రూపంలో ఊహించని షాక్ తగులుతోంది. కేవలం 2026 మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 3,323 మంది భారతీయులను కెనడా సరిహద్దు భద్రతా సంస్థ వెనక్కి పంపించేసింది. గత ఏడాది మొత్తం పంపించిన వారి సంఖ్యతో పోలిస్తే ఇది ఏకంగా 88 శాతానికి సమానం కావడంతో ఈ ఏడాదంతా కలిపి కొత్త రికార్డు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.మెక్సికోను వెనక్కి నెట్టి తొలి స్థానంలో భారత్గత ఐదేళ్లుగా కెనడా నుంచి అత్యధికంగా పంపించివేతలకు గురైన వారి జాబితాలో మెక్సికో మొదటి స్థానంలో ఉండేది. కానీ ఈ ఏడాది సీన్ పూర్తిగా మారిపోయింది. మెక్సికోను దాటుకుని భారతీయులే అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 1,573 మంది మెక్సికన్లు వెనక్కి వెళ్లగా, మన దేశస్థులు మాత్రం ఆ సంఖ్యకు రెట్టింపు స్థాయిలో ఉన్నారు. ఒకప్పుడు అంటే 2021లో కేవలం 603 మంది భారతీయులే కెనడా నుంచి తిరిగొచ్చారు. కానీ అక్కడ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు బిగించడంతో ఆ సంఖ్య ఏడాదికేడాది విపరీతంగా పెరిగిపోయి ఈ స్థితికి చేరుకుంది.Canada: వర్క్ పర్మిట్లపై కఠిన నిబంధనలు. భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..కారణాలు ఇవే.. నిబంధనల విరమణపై వేటుతాత్కాలిక నివాసితులు, విదేశీ విద్యార్థులు, తాత్కాలిక కార్మికుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో కెనడా ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. వీసా గడువు పూర్తయినా అక్కడే ఉండటం, నకిలీ పత్రాలతో ప్రవేశించడం, శరణార్థి దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలే ఈ పంపకాలకు ప్రధాన ప్రాతిపదికగా తెలుస్తోంది. ఇది చాలదన్నట్లు, ఇప్పటికీ దాదాపు 7,669 మంది భారతీయులు కెనడా అధికారుల డిపోర్టేషన్ ముందస్తు జాబితాలో వేచి ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.పిఠాపురం కుర్రాడికి జాక్‌పాట్‌