కళ్యాణలక్ష్మి
Actor ProfilePolitician

కళ్యాణలక్ష్మి

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం బీఆర్ ఎస్ పోరుబాట
HMTV12 Jan 2027
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం బీఆర్ ఎస్ పోరుబాట

Sathupalli: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, సత్తుపల్లిలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించాయి. సత్తుపల్లిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, “కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలి” అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో పేద కుటుంబాల కష్టాలను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. తొలుత రూ.50 వేలతో ప్రారంభించిన ఈ పథకం ఆర్థిక సహాయాన్ని అనంతరం రూ.1,00,116కు పెంచి, వేలాది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారని సండ్ర వెంకట వీరయ్య గారు ఆవేదన వ్యక్తం చేశారు. పథకానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం సకాలంలో స్పందించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని సండ్ర గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఆ హామీపై ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను

రేపు మంథనిలో నలుగురు మంత్రుల పర్యటన.. వివరాలు
HMTV11 Jan 2027
రేపు మంథనిలో నలుగురు మంత్రుల పర్యటన.. వివరాలు

Manthani: రేపు మంథనిలో నలుగురు మంత్రుల పర్యటన.. వివరాలు మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రేపు రాష్ట్రానికి చెందిన నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి