కలిదిండిలో 'మీ భూమి
Actor ProfilePolitician

కలిదిండిలో 'మీ భూమి

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఏ సమస్యకు తక్షణ పరిష్కారం.. 830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఊరట
AP7AM28 Nov 2026
ఏ సమస్యకు తక్షణ పరిష్కారం.. 830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఊరట

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణ పరిష్కారం చూపారు. సోమవారం ఆయన ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం పరిధిలోని కలిదిండిలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమం కోసం

కలిదిండిలో 'మీ భూమి-మీ హక్కు'.. పట్టాదారు పాస్ బుక్ లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
AP7AM27 Nov 2026
కలిదిండిలో 'మీ భూమి-మీ హక్కు'.. పట్టాదారు పాస్ బుక్ లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడే జనం జై కొడతారని, లేకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేవలం బటన్లు నొక్కి, పరదాల చాటున తిరిగితే ప్రజలు ఆదరించరని, అందుకే గత ప్రభుత్వాన్ని 11 సీట్లకే పరిమితం చేశారని పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో సోమవారం నిర్వహించిన "మీ భూమి-మీ హక్కు" కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ఏకైక అజెండా అని, సుపరిపాలన అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ సూపర్‌ స్పీడ్‌తో పనిచేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్ల భూ సమస్యలు తీవ్రమయ్యాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కరించి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు.భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే రీసర్వే చేపట్టినట్లు చంద్రబాబు వివరించారు. కొత్తగా అందిస్తున్న పట్టాదారు పాస్‌పుస్తకాలకు కరెన్సీ నోట్లకు ఉండే భద్రతా ఫీచర్లతో పాటు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక సాంకేతికతను జోడించామన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9,365 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి చేసి, 32.32 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశామని, మరో 68.64 లక్షల పాస్‌పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని