కరువు పనికి తల్లి ఫోన్ తీసుకెళ్లిందని
Actor ProfilePolitician

కరువు పనికి తల్లి ఫోన్ తీసుకెళ్లిందని

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కరువు పనికి తల్లి ఫోన్ తీసుకెళ్లిందని, ఊహించని పనిచేసిన కూతురు.. ఇంటికి వచ్చేసరికి దారుణం
Samayam Telugu30 Oct 2026
కరువు పనికి తల్లి ఫోన్ తీసుకెళ్లిందని, ఊహించని పనిచేసిన కూతురు.. ఇంటికి వచ్చేసరికి దారుణం

చిన్న చిన్న విషయాలకే ఈ రోజుల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత, తమకు నచ్చని పని అవతలి వాళ్లు చేసినా.. తమ నిర్ణయాలను కాదని తల్లిదండ్రులు చెప్పినా ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఓ కూతురు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో జీవితాంతం మరచిపోలేని విషాదాన్ని నింపింది. తనను ఫోన్ చూడొద్దని చెప్పడమే కాకుండా, ఫోన్ తీసుకుని తల్లి కరువు పనికి వెళ్లిందనే కోపంతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది ఓ కూతురు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం సోమలరేగడకు చెందిన చేజర్ల పద్మారెడ్డి, కామేశ్వరి దంపతులకు ఒకే ఒక్క కూతురు జ్యోత్స్న (18). ఇంటర్నీడియట్ పూర్తి కావడంతో ఎంసెట్ రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తోంది. తల్లిదండ్రులు పనులకు వెళ్తుంటారు. ఇంట్లో ఉన్న జ్యోత్స్న ఎప్పుడూ ఫోన్ చూస్తూనే ఉంటుంది. దాంతో ఇది గమనించిన తల్లి కామేశ్వరి ఫోన్ చూడొద్దంటూ కూతురికి చాలాసార్లు చెప్పింది. READ ALSO విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున ఉలిక్కిపడ్డ జనంఎంత చెప్పినా కూడా కూతురిలో మార్పు రాకపోవడంతో.. ఉదయాన్నే ఉపాధిహామీ కరువు పనులకు వెళ్తూ కుమార్తె దగ్గరున్న సెల్‌ఫోన్ తీసుకెళ్లింది. తన ఫోన్ తీసుకుని తల్లి వెళ్లిందన్న కోపంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. జ్యోత్స్న కనిపించకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూసిన చుట్టుపక్కల వాళ్లకి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించడంతో వెంటనే 108కు సమాచారం అందించారు. దాంతో యువతిని ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు చేద్దామని చూసిన వైద్యులు జ్యోత్స్న అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక్కగానొక్క కూతురు ఇలా క్షణికావేశంతో కూతురు ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానిక ఎస్సై సుభాషిణి