ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మారమూల పల్లెల్లోనూ భూముల ధరలు లక్షలు పలుకుతున్నాయి. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కన్నేసి సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోనూ భూముల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవతున్నాయి. పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ డిమాండ్‌తో భూముల ధరలు భారీగా పెరగటంతో పట్టణ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలపై కొందరు ఆక్రమణదారులు కన్నేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న కొద్దిపాటి ప్రైవేట్ స్థలాలను తొలుత కొనుగోలు చేసి.. క్రమంగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోకి చొచ్చుకెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మధిర పట్టణానికి దశాబ్దాలుగా ఉన్న పురాతన డొంక రహదారి క్రమంగా ఆక్రమణలకు గురవుతోంది. ఒకప్పుడు ప్రజల రాకపోకలకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడిన ఈ మార్గం భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.మధిరలోని ఎస్సీ కాలనీ నుంచి దెందుకూరు వరకు సుమారు 5 కిలోమీటర్ల పొడవున డొంక రహదారి ఉంది. మధిర–విజయవాడ ప్రధాన రహదారి సమీపం నుంచి కొనసాగుతున్న ఈ మార్గం దాదాపు శతాబ్ద కాలంగా ప్రజల వినియోగంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభుత్వ భూమికి విలువ కూడా పెరిగింది. ఎస్సీ కాలనీ నుంచి మార్కెట్‌యార్డు వరకు గజం ధర సుమారు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతున్నట్లు స్థానిక రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డొంకకు ఆనుకుని ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేసిన కొందరు క్రమంగా ప్రభుత్వ భూమిలోకి చొచ్చుకెళ్తున్నారు.దీంతో ఒకప్పుడు 100 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ పురాతన మార్గం ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కేవలం 20 అడుగులకు మాత్రమే పరిమితమైనట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు 5 కిలోమీటర్ల
Actor ProfilePolitician
కబ్జా కోరల్లో రూ.400 కోట్ల ప్రభుత్వ స్థలం.. డొంక రహదారిలో నిర్మాణాలు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•17 Jan 2027
కబ్జా కోరల్లో రూ.400 కోట్ల ప్రభుత్వ స్థలం.. డొంక రహదారిలో నిర్మాణాలు