కోహ్లీ ఒక్కడే కాదు
Actor ProfileActor

కోహ్లీ ఒక్కడే కాదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో
Asianet News Telugu5 Oct 2026
కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కుటుంబంతో కలిసి లండన్ లో నివాసముంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ అయిన అతడి భార్య అనుష్క శర్మ సినిమాలకు దూరంగా ఉంటోంది... ఇద్దరు బిడ్డలు వామిక, అకాయ్ ఆలనాపాలనా చూస్తోంది. ఇండియాలో సాధారణ జీవితం గడిపే అవకాశం ఉండదు కాబట్టే లండన్ లో సెటిల్ అయ్యామని కోహ్లీ దంపతులు చెబుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు ఇప్పటికే చాలామంది మాజీ క్రికెటర్లు విదేశాల్లో సెటిల్ ఆయ్యారు. ఇప్పుడు ఏ మాజీ టీమిండియా ఆటగాడు ఏ దేశంలో ఉంటున్నాడో ఇక్కడ తెలుసుకుందాం. భారత మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప తన దూకుడైన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఊతప్ప సభ్యుడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లకు ఆడాడు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఊతప్ప కుటుంబంతో కలిసి దుబాయ్‌కు మకాం మార్చాడు. పిల్లల చదువులు, మెరుగైన జీవనశైలి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు సందర్భాల్లో అతడు వెల్లడించాడు. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా, కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఫరూఖ్ ఇంజనీర్ 1960, 70వ దశకాల్లో కీలక ఆటగాడు. తన దూకుడైన బ్యాటింగ్, చురుకైన వికెట్ కీపింగ్‌తో బాగా పాపులర్ అయ్యాడు. భారత్ తరఫున 46 టెస్టులు ఆడి 2,600కు పైగా పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి, ఆ తర్వాత ఇంగ్లండ్‌లోని లాంకషైర్ కౌంటీ క్లబ్‌కు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత భార్యతో కలిసి ఇంగ్లండ్‌లోనే స్థిరపడ్డాడు. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా, గెస్ట్ స్పీకర్‌గా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. భారత మాజీ ఆల్-రౌండర్ రూసీ సుర్తి 1960లలో టీమిండియాలో ముఖ్యమైన ఆటగాడు. ఎడమచేతి వాటం బ్యాటర్, ఎడమచేతి మీడియం