కాసేపట్లో లెనిన్’ విడుదల.. అఖిల్ సంచలన పోస్ట్
Actor ProfileActor

కాసేపట్లో లెనిన్’ విడుదల.. అఖిల్ సంచలన పోస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కాసేపట్లో లెనిన్’ విడుదల.. అఖిల్ సంచలన పోస్ట్
Chitrajyothy18 Oct 2026
కాసేపట్లో లెనిన్’ విడుదల.. అఖిల్ సంచలన పోస్ట్

అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ టైమ్‌లో సోషల్ మీడియా వేదికగా అఖిల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అక్కినేని అఖిల్ (Akhil Akkineni) నటించిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin) మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ‘ఏజెంట్’ తర్వాత దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం, వ్యక్తిగత గాయాల వంటి ఎన్నో ఆటంకాలను దాటుకుని అఖిల్ చేసిన సాలిడ్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున (King Nagarjuna), సూర్యదేవర నాగ వంశీ (Suryadevara Naga Vamsi) ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు అఖిల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఎమోషనల్ నోట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘ఒక సుదీర్ఘమైన ప్రయాణం ముగింపుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు ఈ రాత్రి నేను కొన్ని విషయాలు అందరితో పంచుకోవాలనుకుంటున్నాను’’ అంటూ అఖిల్ తన ట్వీట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రాణం పెట్టి తెరకెక్కించిన తన ‘లెనిన్’ చిత్ర బృందానికి, ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమా ప్రమోషన్స్ సమయం నుంచి తమ కంటెంట్‌ను పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుని, తమను ఎంతగానో ప్రోత్సహించిన మీడియాకు, ప్రేక్షకులకు, ముఖ్యంగా తనను ప్రాణంగా ప్రేమించే అక్కినేని అభిమానులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘ఇకపై మా చేతుల్లో ఏమీ లేదు.. అవర్ లెనిన్ ఈజ్ యువర్స్ నౌ. మీరందరూ ఈ చిత్రాన్ని మనస్ఫూర్తిగా ఆనందిస్తారని ఆశిస్తున్నాను. థియేటర్లలో కలుద్దాం’’ అంటూ అఖిల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అఖిల్ కెరీర్‌లోనే