
నియమ నిబంధనల ఉచ్చులో చిక్కుకుని, పాత కేసులతో సతమతమవుతున్న దేశంలోని ప్రైవేట్, ఎగ్జెంప్టెడ్ ప్రావిడెంట్ ఫండ్ (PF) ట్రస్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను (ఐటీ) చట్టాల్లో వచ్చిన సరికొత్త మార్పులకు అనుగుణంగా ప్రైవేట్ పీఎఫ్ ట్రస్ట్‌లు తమను తాము చక్కదిద్దుకునేందుకు వీలుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక ప్రత్యేకమైన అమ్నెస్టీ స్కీమ్-2026 (క్షమాభిక్ష పథకం)ను ప్రకటించింది. జూన్ 29, 2026 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ సరిగ్గా ఆరు నెలల పాటు అంటే.. డిసెంబర్ 2026 చివరి వరకు అందుబాటులో ఉండనుంది.అసలు సమస్య ఎక్కడ వచ్చింది?చాలా కంపెనీలు తమ ఉద్యోగుల పీఎఫ్ డబ్బులను ఈపీఎఫ్ఓలో జమ చేయకుండా, ఆదాయపు పన్ను శాఖ గుర్తింపుతో సొంతంగా పీఎఫ్ ట్రస్ట్‌లను (Exempted Trusts) నడుపుతుంటాయి. అయితే, ఇటీవల తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టాల కింద గుర్తింపు కొనసాగాలంటే, ఆయా ట్రస్ట్‌లు ఖచ్చితంగా ఈపీఎఫ్ చట్టం-1952 లోని సెక్షన్ 17 ప్రకారం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారిక మినహాయింపు (Exemption) ఉత్తర్వులు పొంది ఉండాలి. కానీ, దేశంలో చాలా ట్రస్ట్‌లు ఐటీ శాఖ గుర్తింపుతో నడుస్తున్నప్పటికీ, ఈపీఎఫ్ఓ నుంచి పూర్తిస్థాయి మినహాయింపు పత్రాలు లేకుండానే నడుస్తున్నాయి. ఇలాంటి వాటిని ఒకే తాటిపైకి తెచ్చి, చట్టబద్ధం చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. EPFO: వడ్డీ డబ్బులు పడ్డాయ్..! జమ కాని వాళ్లు కంగారు పడకండిరెండు రకాలుగా మినహాయింపు..ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే అర్హులైన సంస్థలను ఈపీఎఫ్ఓ రెండు విభాగాలుగా విభజించింది.మొదటి విభాగం: గత కాలానికి సంబంధించి పాత నిబంధనలను రెగ్యులరైజ్ చేసుకుని, ఇకపై ఈపీఎఫ్ఓ పరిధిలోకి (Un-exempted) వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలు.రెండో విభాగం: పాత తప్పులను సరిదిద్దుకుంటూనే.. కొత్త సోషల్ సెక్యూరిటీ కోడ్-2020 ప్రకారం భవిష్యత్తులో కూడా సొంతంగానే ఎగ్జెంప్టెడ్ ట్రస్ట్‌లుగా కొనసాగాలనుకునే సంస్థలు. EPFO: UAN యాక్టివేషన్‌కు
