
టెహ్రాన్: ఇరాన్ సర్వోన్నత నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం, ఆచూకీపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. ఇరాన్‌క చెందిన సెమీ-అఫీషియల్ మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ వీడియో, ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందనే వదంతులను తిప్పికొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ చేసిందనే దానిపై స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులలో ఆయన తండ్రి అయతొల్లా అలి ఖమేనీ హత్య తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మొజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారాన్ని అందిస్తున్నారు. దాడుల సమయంలో ఆయన గాయపడ్డారని, ఆ తర్వాత రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని చెబుతున్నారు. జూలైలో సౌదీ వార్తా సంస్థ అల్-హదత్ ఇజ్రాయెల్.. ఖమేనీ ఇరాన్‌లో లేరని తెలిపింది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ, సర్వోన్నత నేతతో ప్రత్యక్ష సంబంధాలు ప్రస్తుతం చాలా కష్టంగా ఉన్నాయని అంగీకరించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగా లేదని ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు. ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ! ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన