
ఇంటర్నెట్ డెస్క్: ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన (UBT)కి చెందిన మాజీ ఎంపీ వినాయక్ రౌత్‌పై ఆయన కోడలు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తన అత్తామామలు, భర్త క్షుద్రపూజలు చేసేవారి వద్దకు తీసుకెళ్లారని, తన జుట్టును తీసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు మామ వినాయక్ రౌత్, భర్త జితేశ్ రౌత్, క్షుద్రపూజలు చేసిన ఫిరోజ్ బాబా, కాజీ బాబాపై గిరిజా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్తింటివారు శారీరకంగా, మానసికంగా వేధించారని గిరిజా ఆరోపించారు. తనను పలుమార్లు క్షుద్రపూజలు చేసే వారి వద్దకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. తన వెంట్రుకలు తీసుకుని వాటితో క్షుద్రపూజలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వైవాహిక సమస్యలకు అతీంద్రియ శక్తులే కారణమని అత్తామామలు నిందించారని తెలిపారు. దీనిపై వినాయక్ రౌత్ స్పందించారు. తన కుమారుడు, కోడలు మధ్య భరణానికి సంబంధించి వివాదం నడుస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తనపై ఫిర్యాదు చేసిందని చెప్పారు. భరణం వివాదం మొదలైనప్పుడే గిరిజా పోలీసులను ఆశ్రయించిందని పేర్కొన్నారు. మూడేళ్ల నుంచి తమ కుమారుడికి కోడలు దూరంగా ఉంటున్నట్లు రౌత్ పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు