కేవలం రూ.22
Actor ProfilePolitician

కేవలం రూ.22

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేవలం రూ.22,000 పెట్టుబడితో రోజుకు లక్ష, నెలకు రూ.30 లక్షలా..! ఇలాంటి ప్రభుత్వ పథకం ఉందా
Asianet News Telugu27 Oct 2026
కేవలం రూ.22,000 పెట్టుబడితో రోజుకు లక్ష, నెలకు రూ.30 లక్షలా..! ఇలాంటి ప్రభుత్వ పథకం ఉందా

టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరాలూ ఎక్కువ అవుతున్నాయి... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దీనికి మినహాయింపు కాదు. ఇటీవల కాలంలో ప్రజల్లో AI వాడకం పెరిగింది... ఇదే అదునుగా సైబర్ కేటుగాళ్లు కూడా ఏఐ సాయంతో మోసాలకు తెరతీశారు. ఏకంగా ప్రభుత్వ పథకాల పేరిట.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నకిలీ వీడియోలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా తాజాగా సోషల్ మీడియాలో ఓ నకిలీ ఇన్వెస్ట్మెంట్ వీడియో చక్కర్లు కొడుతోంది. సైబర్ నేరగాళ్లు ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో బ్యాంక్ అధికారుల పేరిట అకౌంట్ వివరాలు సేకరించి డబ్బులు కాజేశారు. ఇలాంటి మోసాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది... అందుకే AI టెక్నాలజీ సాయంతో కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర రాజకీయ, వ్యాపార ప్రముఖుల పేరిట చిన్న పెట్టుబడులకు భారీ లాభాలు అంటూ ప్రచారం చేస్తున్నారు... వీళ్లు ప్రకటించినట్లుగా నకిలీ వీడియోలను AI సాయంతో రూపొందిస్తున్నారు. ఇలా తాజాగా ఆర్థిక మంత్రి రూ.22,000 పెట్టుబడి పెడితే రోజుకు రూ.1 లక్ష ఆదాయం పొందవచ్చని ప్రకటించినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. ఇలా నెలకు ఒకటి రెండు కాదు ఏకంగా రూ.30 లక్షలు సంపాదించవచ్చు అని నిర్మలా సీతారామన్ హామీ ఇస్తున్నట్లు నమ్మిస్తున్నారు కేటుగాళ్లు. వెంటనే రూ.22,000 పెట్టుబడి పెట్టేవారికే ఈ అవకాశం అని చెప్పి ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా మోసగించే పన్నాగం పన్నారు. ప్రభుత్వ పథకం అంటున్నారు... ప్రధాని, ఆర్థిక మంత్రి హామీ ఇస్తున్నారు అని నమ్మి డబ్బులు చెల్లించారో మోసపోయినట్లే. ఇది సైబర్ కేటుగాళ్లు ఏఐ సాయంతో మోసం చేసేందుకు రూపొందించిన వీడియో అని గుర్తించాలి. ఇటువంటి ప్రచారాల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి... ఇది పూర్తిగా మోసపూరిత పథకం. ప్రధాని మోదీ, మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట