
రాజమండ్రిలో సంచలనం సృష్టించిన ప్రియాంక రోడ్డు ప్రమాదం కేసులో కీలక వివరాలను ఎస్పీ నరసింహ కిశోర్ మీడియా ముందు వెల్లడించారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, నిందితులు అత్యంత క్రూరంగా క్రిమినల్ చర్యకు పాల్పడ్డారని ఆయన స్పష్టం చేశారు. పక్కా ఆధారాలతో కేసును బలంగా నిర్మించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పురోగతిని, ఘటన జరిగిన తీరును ఆయన సమగ్రంగా వివరించారు.అసలేం జరిగింది?ఎస్పీ నరసింహ కిశోర్ కథనం ప్రకారం, ఘటన జరిగిన రోజు రాత్రి ప్రియాంక, ఆమె స్నేహితుడు ఉమేష్ స్కూటీపై సినిమా ఫస్ట్ షో చూసి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో నిందితులు ఇద్దరు మరో సినిమా చూసేందుకు అదే మాల్‌కు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు, మాల్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా వారితో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దదవడంతో, సెక్యూరిటీ సిబ్బంది తమను పట్టుకుంటారనే భయంతో నిందితులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు వేగంగా సెల్లార్‌లోని తమ కారు వద్దకు చేరుకున్నారు.తప్పించుకునే హడావుడిలో కారును వేగంగా పోనిస్తూ, స్కూటీపై వెళుతున్న ప్రియాంక, ఉమేష్‌లను ఒకసారి ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా, కావాలనే మరో రెండుసార్లు వారిపై నుంచి కారును పోనిచ్చి అత్యంత కిరాతకంగా ప్రవర్తించి పారిపోయారని ఎస్పీ తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయని, అవి చాలా భయంకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.పోలీసుల దర్యాప్తు ఇలా..ఘటన జరిగిన మూడో తేదీ రాత్రి ఆసుపత్రి నుంచి సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు