క్వీన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ
Actor ProfilePolitician

క్వీన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
క్వీన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ
Telugu Times30 Oct 2026
క్వీన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న రమ్యకృష్ణ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో “క్వీన్” మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది‌. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ హీరోయిన్ తండ్రి పాత్రను పోషిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. “క్వీన్” చిత్రంలో ఒక పవర్ ఫుల్, స్ట్రాంగ్ క్యారెక్టర్ లో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు. రమ్యకృష్ణ తమ సినిమా టీమ్ లో జాయిన్ అవుతున్న సందర్భంగా చిత్రబృందం ఆమెకు ఆహ్వనం పలికారు. “క్వీన్” చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా, రియల్ క్యారెక్టర్స్ ను స్ఫూర్తిగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో దర్శకుడు రతన్ రిషి రూపొందిస్తున్నారు. 2006-2010 మధ్య కాలం నేపథ్యంగా ఈ చిత్ర కథ సాగనుంది. ప్రస్తుత సొసైటీ తో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నారు. “క్వీన్” సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది