క్వీన్ 2'
Actor ProfileActor

క్వీన్ 2'

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
క్వీన్ 2' పై రూ.250 కోట్ల కేసు... కానీ అసలు ట్విస్ట్ మాత్రం ఇదే
Telugu Times8 Oct 2026
క్వీన్ 2' పై రూ.250 కోట్ల కేసు... కానీ అసలు ట్విస్ట్ మాత్రం ఇదే

– సూర్య ప్రకాష్ జోశ్యుల ఒకప్పుడు అదే సినిమా కంగనా రనౌత్‌కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే సినిమా... ఆమె కొత్త చిత్రాన్ని కోర్టు గుమ్మం వరకు తీసుకొచ్చింది. ఒక కథ... ఇద్దరు నిర్మాతలు... రెండు వాదనలు. మరి అసలు 'క్వీన్' ఎవరిది? ఇప్పుడు బాలీవుడ్‌లో అందరూ మాట్లాడుకుంటున్న ప్రశ్న ఇదే. వివాదం ఏమిటి? కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'క్వీన్ 2' విడుదలకు ముందే భారీ లీగల్ వివాదంలో చిక్కుకుంది. 2014లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'క్వీన్' చిత్ర మేధో సంపత్తి (IP) హక్కులను ఉల్లంఘిస్తూ ఈ సినిమా తెరకెక్కించారని ఆరోపిస్తూ ఫాంటమ్ స్టూడియోస్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఏకంగా రూ.250 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేయడంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అసలు వివాదం పేరు గురించా... కథ గురించా? ఇదే ఇప్పుడు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న ప్రశ్న.పైపైన చూస్తే 'క్వీన్ 2' అనే టైటిల్‌పైనే వివాదం అనిపిస్తుంది. కానీ ఫాంటమ్ స్టూడియోస్ వాదన మాత్రం అంతకంటే పెద్దది. తమ అనుమతి లేకుండా ఒరిజినల్ 'క్వీన్' చిత్రానికి సంబంధించిన మేధో సంపత్తిని ఉపయోగించి ఈ సినిమా రూపొందించారని సంస్థ ఆరోపిస్తోంది. ఫాంటమ్ స్టూడియోస్ ప్రకారం... 2014లో వచ్చిన 'క్వీన్' చిత్ర ఐపీ హక్కుల్లో తమకు 50 శాతం వాటా ఉంది. అందువల్ల ఆ చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌లు, స్పిన్-ఆఫ్‌లు లేదా ఇతర రూపాల్లో కొత్త సినిమాలు రూపొందించాలంటే తమ అనుమతి తప్పనిసరి అని కోర్టులో వాదిస్తోంది. ఇక్కడే కథలో మరో ట్విస్ట్... ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహించింది కూడా 'క్వీన్' దర్శకుడు వికాస్ బహల్. హీరోయిన్ కూడా కంగనా రనౌత్‌నే. అదే దర్శకుడు... అదే హీరోయిన్... 'క్వీన్ 2' అనే టైటిల్. ఈ మూడు అంశాలే ఇప్పుడు అనుమానాలకు కారణమయ్యాయి. కానీ జియోస్టార్ కథ మరోలా చెబుతోంది... ఫాంటమ్ ఆరోపణలను

న్యాయపరమైన చిక్కుల్లో క్వీన్ 2
Chitrajyothy3 Oct 2026
న్యాయపరమైన చిక్కుల్లో క్వీన్ 2

కంగనా రనౌత్ 'క్వీన్ 2'కు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ఈ సినిమా నిర్మాణానికి తమ అనుమతి తీసుకోలేదంటూ ఫాంటమ్ స్టూడియోస్ బాంబే హైకోర్టులో కేసు వేసింది. నటిగా కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమౌతోంది