నటుడు శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నారు. #90స్ వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘కోర్ట్’ సినిమాతో క్రేజీ ఆర్టిస్టుగా మారిపోయారు. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకున్నారు. ఓవైపు నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూనే, మరోవైపు ప్రధాన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూ వస్తున్నారు. మరో మూడు రోజుల్లో ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన ఇప్పుడు సొంతంగా ‘పీఆర్ షో’ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి, నిర్మాత అవతారమెత్తుతున్నారు. తాజాగా తన బ్యానర్ లో తొలి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడం లేదు. స్టోరీ అందించడంతోపాటుగా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో శివాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు.‘పీఆర్ షో’ లాంచ్ వీడియోని సోమవారం రిలీజ్ చేశారు. ప్రొడక్షన్ నెం.1లో మమితా బైజు, ‘డ్రాగన్’ దర్శకుడు అశ్వత్ మారిముత్తు, శివాజీ, శ్వాసిక, అనామిక మాహి, లిజ్జీ ఆంటోనీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు ప్రకటించారు. ‘ది ఆల్ఫా యూనిట్’ పేరుతో ఆరుగురు యంగ్ డైరెక్టర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 'డ్యూడ్' మూవీలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు కలిసి నటించారు. ఇప్పుడు ప్రదీప్ నిర్మాణంలో మమితా లీడ్ రోల్ ప్లే చేస్తుండటం గమనార్హం.'PRS 01' అనౌన్స్‌మెంట్ వీడియోలో శివాజీ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇది శివాజీకి మంచి తమిళ్ డెబ్యూ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ‘కోర్ట్’, ‘దండోరా’ సినిమాలకు ఓటీటీలలోనూ విశేష ఆదరణ
Actor ProfileActor
కోలీవుడ్ లోకి శివాజీ ఎంట్రీ.. డ్రాగన్ డ్యూడ్’ కాంబోలో ప్రదీప్ రంగనాథన్ క్రేజీ ప్రాజెక్ట్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•30 Sept 2026
కోలీవుడ్ లోకి శివాజీ ఎంట్రీ.. డ్రాగన్ డ్యూడ్’ కాంబోలో ప్రదీప్ రంగనాథన్ క్రేజీ ప్రాజెక్ట్