కిలోమీటర్లు.. 30 నిమిషాలు.. ఖాళీ కుర్చీలు
Actor ProfilePolitician

కిలోమీటర్లు.. 30 నిమిషాలు.. ఖాళీ కుర్చీలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కిలోమీటర్లు.. 30 నిమిషాలు.. ఖాళీ కుర్చీలు
Sakshi14 Jan 2027
కిలోమీటర్లు.. 30 నిమిషాలు.. ఖాళీ కుర్చీలు

బెంగళూరు: ఉదయం 10.15 గంటలు.. సాధారణంగా ఐటీ ఉద్యోగులతో కిక్కిరిసిపోయే సమయం. కానీ ఓ ఆఫీసులో మాత్రం చాలా డెస్క్‌లు ఖాళీగా కనిపించాయి. ఉద్యోగులు పని చేయడానికి ఇష్టపడటం వల్ల కాదు.. ఆఫీసుకు చేరుకునేలోపే వారి శక్తి మొత్తం ట్రాఫిక్‌లో ఆవిరైపోతోందట! బెంగళూరు ట్రాఫిక్‌ ఉద్యోగుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో ఓ స్టార్టప్‌ ఫౌండర్‌ పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. Applied AI Studio వ్యవస్థాపకుడు బాల పన్నీర్‌సెల్వం తన ఆఫీసులో ఖాళీగా ఉన్న డెస్క్‌ల ఫొటోను లింక్డ్‌ఇన్‌లో షేర్‌ చేశారు. “సమస్య మనుషుల్లో లేదు.. ఆఫీసుకు చేరుకోవడానికి పడుతున్న శ్రమలో ఉంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బెంగళూరు ఉద్యోగుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. 4 కిలోమీటర్లకు అరగంట.. బెంగళూరులో చిన్న దూరం ప్రయాణం కూడా పెద్ద సవాలుగా మారిందని బాల చెప్పారు. హెచ్‌ఎస్‌ఆర్‌ ప్రాంతంలో కేవలం 4 కిలోమీటర్లు వెళ్లేందుకు స్కూటర్‌పై సుమారు 20 నిమిషాలు, కారులో అయితే 30 నిమిషాల వరకు పడుతోందన్నారు. పీక్‌ అవర్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్‌లో వాహనాల మధ్య దారి వెతుక్కుంటూ.. సిగ్నల్స్‌ పట్టించుకోకుండా దూసుకొచ్చే ద్విచక్ర వాహనాలను తప్పించుకుంటూ ప్రయాణించే సరికి ఆఫీసుకు చేరుకునే సమయానికే ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నారని చెప్పారు. 17 కిలోమీటర్లు.. 2 గంటలు! తనకెదురైన అనుభవాన్ని కూడా బాల పంచుకున్నారు. వర్షం లేకుండా, ఎలాంటి స్పష్టమైన అంతరాయం లేని రోజున సాయంత్రం 4 గంటలకు వైట్‌ఫీల్డ్‌ నుంచి హెచ్‌ఎస్‌ఆర్‌ వరకు 17 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా రెండు గంటలు పట్టిందని తెలిపారు. ఇక సాయంత్రం 6 తర్వాత ఆఫీసు నుంచి బయలుదేరితే ఇంటికి చేరుకునేందుకు మరింత సమయం పడుతోందన్నారు. 5 గంటలకే బయలుదేరిన ఉద్యోగులు కూడా ఇంటికి చేరేసరికి వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదించేంత శక్తి లేకుండా పోతున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్‌.. ప్రొడక్టివిటీకి విలన్‌? “ఇంత గందరగోళం మధ్య