
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) త్వరలో కేరళ వెళ్లనున్నారు. ఆయన వెళ్తోంది సినిమా షూటింగ్ కోసం కాదు, రాజకీయాల కోసం అంతకంటే కాదు. ఆయన ప్రకృతి వైద్యం కోసం కేరళ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన భుజానికి సర్జరీ చేయించుకున్నారు. ముంబయిలో ఈ సర్జరీ జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతమైనప్పటికీ, గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి, చేతి కండరాలు సాధారణ స్థితికి రావడానికి డాక్టర్లు పూర్తి విశ్రాంతిని, కొన్ని ప్రత్యేక వ్యాయామాలను సూచించారు. దీంతో ఆయన కేరళ వెళ్లి ప్రకృతి వైద్యం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేరళలోని ఒక ప్రఖ్యాత ఆయుర్వేద-ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో దాదాపు 20 రోజుల పాటు గడుపుతారు. ఎలాంటి రాజకీయ, అధికారిక టెన్షన్లు లేకుండా, పూర్తిగా ప్రకృతిలో ఉంటూ ప్రత్యేకమైన ఫిజియోథెరపీ సెషన్స్ తీసుకుంటారు. ఈ నిర్ణయం, పవన్ మరింత త్వరగా కోలుకోవడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. అయితే అక్కడితో అయిపోలేదు. కోలుకున్న వెంటనే, పవన్ మరో భుజానికి శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంది. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తవ్వడానికి కనీసం మరో 3 నెలలైనా పడుతుంది