కేరళ గుడిలో విదేశీ ఎంపీతో మళ్లీ వివాహం
Actor ProfilePolitician

కేరళ గుడిలో విదేశీ ఎంపీతో మళ్లీ వివాహం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేరళ గుడిలో విదేశీ ఎంపీతో మళ్లీ వివాహం
Sakshi20 Jan 2027
కేరళ గుడిలో విదేశీ ఎంపీతో మళ్లీ వివాహం

ప్రేమకు సరిహద్దులు లేవని ఈ జంట కారణంగా మరోసారి నిరూపితమైంది. ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు గానీ దాన్ని గెలిపించుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు, ఎంత కాలమైన నిరీక్షిస్తారు. అచ్చం అలానే ఈ స్కాటిష్‌ ఎంపీ పదేళ్లు నిరీక్షించి మరీ కేరళ మహిళను పెళ్లాడాడు స్కాటిష్‌ రాజకీయ నాయకుడు. దేశం దాటిన ఈ దంపతుల ప్రేమ కథ ఏంటో చూద్దామా..! స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) రాజకీయ నాయకుడు , పార్లమెంట్‌ సభ్యుడు మార్టిన్‌ డే కేరళకు చెందిన నిధిన్‌ చంద్‌ను అక్కడ ప్రఖ్యాత గాంచిన గురువాయూర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఎర్నాకులం జిల్లాలోని పిరవంకు చెందిన నిధిన్ చిరకాల కోరిక ఇన్నేళ్లకు నెరవేరిందట. ఈ వివాహ వేడుక మంగళవారం నాడు గురువాయూర్‌ దేవాలయ ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను మార్టిన్‌ డే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. పదేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదు.. నిజానికి ఈ జంట 2016లోనే యూకేలో వివాహం చేసుకున్నారు. కానీ నిధిన్‌ చాలా కాలంగా గురువాయుర్‌లో తన వివాహతంతుని పూర్తి చేయాలని కోరుకున్నారు. 2018 కేరళ వరదలు, కోవిడ్‌ 19 మహమ్మారి వంటి కారణాల వల్ల ఈ జంట వివాహ వేడుక చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు తమ వివాహం రిజిస్టర్ అయిన తొమ్మిదేళ్ల తర్వాత, తన నాలుగవ పర్యటనలో ఆ దంపతులు గురువాయురు ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇది తన భాగస్వామి చిరకాల కోరిక అని చెబుతున్నారు స్కాటిష్‌ ఎంపీ మార్టిన్‌ డే. ఎవరీ మార్టిన్‌ డే.. 55 ఏళ్ల మార్టిన్‌ డే, స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన లిన్లిత్‌గో ప్రాంతానికి స్థానిక, జాతీయ స్థాయిలలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1999లో వెస్ట్ లోథియన్ కౌన్సిల్‌కు