
కొత్త దరఖాస్తుల స్వీకరణ నిలిపివేతకు ఆదేశాలు -అక్రమ లే అవుట్లపై ప్రభుత్వ నిర్ణయం -ఎల్‌ఆర్‌ఎస్-2020 నిబంధనలకు మంగళం -నేటి నుంచి అమల్లోకి వచ్చేలా జీవో జారీ -రుసుంపై కొనసాగనున్న 25 శాతం రాయితీ మంచిర్యాల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): లే అవుట్ అ నుమతుల్లేని వెంచర్లు, అనధికార ప్లాట్లను క్రమబద్ధీ కరణకు ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్‌ఆర్ ఎస్-2020 నిబంధనలకు మంగళం పాడుతూ ఈ నెల 6వ తేదీన జీవో విడుదల చేసింది. సవరించిన నిబం ధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి కొ త్త దరఖాస్తు స్వీకరణను నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్రమబద్ధీకరణ రుసుము, ఇతర చా ర్జీలపై 25 శాతం రాయితీ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభు త్వం జారీ చేసిన జీవో 131 ప్రకారం ఈ నెలాఖరు వ రకు ఫీజు రాయితీ ప్రక్రియను కొనసాగించనుంది. ఈ నెల 31వ తేదీలోపు అనధికార వెంచర్లు, ప్లాట్లను క్ర మబద్ధీకరించుకోవాలనుకునే వారికి మాత్రమే ఈ ఆ ఫర్ వర్తించనుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన రియల్ ఎస్టేట్ రంగంపై ఆంక్షలు... గత మూడేళ్లుగా ఆ రంగంపై ఆధారపడ్డ వ్యాపారులను తీ వ్ర ఇబ్బందులకు గురి చేశాయనడంలో ఎలాంటి అతి శయోక్తిలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ ప్ర భుత్వం 2024లో కొన్ని సంస్కరణలు చేసినా...అవి పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఫీజులో రాయితీ ఇస్తూ మరోమారు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యా ప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో 2015 లో ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ రెగ్యులేషన్ స్కీం) గడువు ముగిసిపోగా, దాదాపు నాలుగేళ్ల తరువాత తిరిగి 2020 ఆగస్టు 31న ఆ ప్రక్రియకు అప్పటి బీఆర్‌ఎస్ ప్ర భుత్వం పచ్చజెండా ఊపింది. అదే రోజు నుంచి ఎల్ ఆర్‌ఎస్ అమల్లోకి వస్తుందంటూ నిబంధనలతో కూడి న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి నాటి