
ఐదేళ్లలో 20వేల స్టార్టప్ లు, లక్ష ఉద్యోగాల కల్పన మా లక్ష్యం ఆవిష్కరణల కేంద్రం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లోకి కొరియన్ స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నాం భారతదేశ ఏఐ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే మా ధ్యేయం సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణల వెన్నెముకగా ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ద్వారా "వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ ప్రెన్యూర్ష నినాదంతో ఐదేళ్లలో 20వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ (SBA) కొరియన్ టెక్ స్టార్టప్ లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... అమరావతిలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ టీఐహెచ్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం ప్రాంతీయ శాఖలతో పనిచేస్తోందన్నారు. టాటా, ఎల్&టీ, జీఎంఆర్, గ్రీన్‌కో, అదానీ, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రఖ్యాత సంస్థల సహకారంతో దీనిని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఆర్ టీఐహెచ్ ఫుల్ లైఫ్ సైకిల్ ప్రోగ్రామ్స్ అయిన స్పార్క్ (ఆలోచనల రూపకల్పన), క్యాటలిస్ట్ (18 వారాల ఇంక్యుబేషన్), వెలాసిటీ ల్యాబ్ లలోకి కొరియన్ స్టార్టప్‌లను ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ఈ వేదిక ఇప్పటికే 2,500కు పైగా స్టార్టప్‌లకు మద్దతునిచ్చింది, 5,200కు పైగా ఎంటర్ ప్రెన్యూర్ లను భాగస్వాములను చేసింది. ఏపీ ఇన్నోవేషన్ & స్టార్టప్ పాలసీ 2024–29లో భాగంగా ప్రోటోటైపింగ్, డీప్-టెక్ గ్రాంట్ల కింద ₹22 కోట్ల RTIH–SIDBI సీడ్ ఫండ్, ₹20 కోట్ల వరకు AIF సీడ్ ఈక్విటీ, క్రెడిట్-గ్యారెంటీ వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చాం. 160కి పైగా VC/ఏంజెల్ సిండికేషన్ నెట్‌వర్క్ కలిగిన ఆర్ టీఐహెచ్ ఇప్పుడు ఏఐ, క్వాంటం, అధునాతన తయారీ కోసం SIDBI భాగస్వామ్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన డీప్-టెక్ ఏంజెల్ ఫండ్‌తో ఇప్పుడు మరింతగా విస్తరించినట్లు తెలిపారు. స్టార్టప్ కారిడార్ ఏర్పాటుకు కలిసి పనిచేద్దాం ఆర్‌టీఐహెచ్‌ను కేంద్రంగా