కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి
Actor ProfilePolitician

కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా
Andhra Jyothy26 Sept 2026
ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామా

టిబెట్‌కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. అమరావతి

రాజకీయంగా ఎదిగేందుకు రాముని పేరు వాడుకున్నారు.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
Andhra Jyothy25 Sept 2026
రాజకీయంగా ఎదిగేందుకు రాముని పేరు వాడుకున్నారు.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

శ్రీరామునికి రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి ఎవరి స్థితికి తగ్గట్టు విరాళాలు ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ నాయకులు రాముని పేరుతో, అక్షింతలపై విరాళాలు అడుక్కున్నారని

కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి
Andhra Jyothy24 Sept 2026
కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి

కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా.. పరిశ్రమలను స్థాపించేలా సహకరించాలని దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్‌దాస్‌ను లోకేశ్‌ కోరారు. ఇంటర్నెట్ విభాగం: కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా.. పరిశ్రమలను స్థాపించేలా సహకరించాలని దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్‌దాస్‌ను లోకేశ్‌ కోరారు. ఆదివారం సియోల్‌లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ‘శాంసంగ్‌, ఎల్‌జీ, ఏఎస్ఐపీ-ఏపీఏసీటీ ఓశాట్‌ ఆధారంగా ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌, ఏపీ ఎలకా్ట్రనిక్స్‌ పాలసీ 4.0కు అనుగుణంగా రాష్ట్రానికి కంపెనీలను రప్పించాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, చిప్స్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా సహకరించండి. శ్రీసిటీ, నాయుడు పేట, కొప్పర్తి, విశాఖపట్నంలో ‘రెడీ టు యూజ్‌’ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర యూనివర్సిటీల్లో నైపుణ్యాభివృద్ధితో కూడిన కరిక్యులమ్‌ను అందిస్తున్నాం. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌ ఈ ఏడాది ఏప్రిల్లో భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు కొరియా ఎన్‌క్లేవ్‌ ఏర్పాటు కోసం చేసిన ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చేందుకు ఆ దేశ చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి చేసిన ప్రతిపాదన మేరకు ప్లగ్‌ అండ్‌ ప్లే విధానాన్ని శ్రీసిటీలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని లోకేశ్‌ వెల్లడించారు. అనంతపురంలో కియ/హ్యూండయ్‌ మొబిస్‌ ఆటో-ఈవీ క్లస్టర్‌ విస్తరణపైనా చర్చ జరిగింది. రాష్ట్ర తీరప్రాంతంలో హెచ్‌డీ హ్యూండయ్‌ తరహా గ్రీన్‌ఫీల్డ్‌ షిప్‌యార్డును ఏర్పాటు చేయాలని లోకేశ్‌ కోరారు. ఏపీలో బ్యాటరీ/గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులు స్థాపించేందుకు కొరియాను ఒప్పించాలన్నారు. కొరియా ప్లస్‌, కొరియా ట్రేడ్‌-ఇన్వస్ట్‌మెంట్ ప్రమోషన్‌ ఏజెన్సీ (కోట్ర), భారత్‌-కొరియా పారిశ్రామిక సహకార కమిటీలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఏపీ-కొరియా డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల పదో తేదీన నిర్వహిస్తున్న సియోల్‌ ఇన్వెస్టర్‌ రోడ్‌షోలో జీ 20 అవగాహన ఒప్పందాల వైపు కంపెనీలను మళ్లించేలా చొరవ చూపాలని గౌరంగ్‌దాస్‌ను కోరారు