కార్మిక కుటుంబానికి న్యాయం జరిగేనా
Actor ProfilePolitician

కార్మిక కుటుంబానికి న్యాయం జరిగేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కార్మిక కుటుంబానికి న్యాయం జరిగేనా
Namasthe Telangana18 Oct 2026
కార్మిక కుటుంబానికి న్యాయం జరిగేనా

24 గంటలు దాటినా ఆగని కుటుంబ సభ్యుల ఆందోళన - కుటుంబానికి న్యాయం కోసం హరీష్, తలసాని, ఈటెలకు బీసీ సంఘ నేతల ఫోన్ - అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐటీసీ గేటు వద్ద పోలీసు బందోబస్తు బూర్గంపహాడ్, జూలై 09 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు వరకూటి నర్సింహారావు బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. అయితే కుటుంబానికి న్యాయం చేయాలని భర్త మృతదేహంతో పిల్లలతో కలిసి బుధవారం సాయంత్రం ఐటీసీ గేటు వద్ద చేపట్టిన ధర్నా 24 గంటలు గడిచినా కొనసాగుతూనే ఉంది. ఈ సంఘటనతో ఐటీసీ గేటు వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఒకవైపు న‌ర్సింహారావు భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు.. మరోవైపు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సర్పంచ్ కిశోర్‌నాయ‌క్ ధర్నాకు దిగడంతో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తోటి కార్మికుడు మృతి చెందడంతో కుటుంబానికి అండగా ఉండేందుకు ఉదయం షిప్ట్‌న‌కు వెళ్లే వేల మంది కాంట్రాక్టు కార్మికులు స్వచ్ఛందంగా విధులకు హాజరు కాలేదు. మృతుడి కుటుంబానికి ఐటీసీ యాజమాన్యంతో పాటు గుర్తింపు సంఘం కార్మిక నాయకులు న్యాయం చేయాలని కాంట్రాక్టు జేఏసీ నాయకులతో పాటు బీసీ సంఘం, బీఆర్ఎస్‌, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొని బాధితులకు అండగా నిలిచాయి. ఆందోళన నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాల్వంచ డీఎస్సీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ మేడా ప్రసాద్ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు కార్మికుడు నర్సింహారావు గుండెపోటుతో మృతి చెందడంతో బాధిత కుటుంబం ఐటీసీ వద్ద ఆందోళన చేస్తున్నారని తెలుసుకున్న సర్పంచ్ గుగులోత్ కిశోర్‌నాయ‌క్ గురువారం ఐటీసీ గేటు వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. కార్మికుడు లంచ్ అవర్‌లో చనిపోయాడు. విధుల్లో చనిపోలేదని ఐటీసీ యాజమాన్యం చెప్పడం బాధాకరమన్నారు. మృతుడి విషయంలో యాజమాన్యం తీరు నిర్లక్ష్యంగా ఉందని