కార్తీతో స్టార్ బ్యూటీ త్రిష.. ఏ సినిమా కోసమంటే
Actor ProfileActor

కార్తీతో స్టార్ బ్యూటీ త్రిష.. ఏ సినిమా కోసమంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కార్తీతో స్టార్ బ్యూటీ త్రిష.. ఏ సినిమా కోసమంటే
123Telugu20 Nov 2026
కార్తీతో స్టార్ బ్యూటీ త్రిష.. ఏ సినిమా కోసమంటే

తమిళ హీరో కార్తీ, లేడీ సూపర్ స్టార్ త్రిష మళ్లీ కలిసి నటించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది. దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో కార్తీ నటిస్తున్న 31వ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌కి మొదటి ఛాయిస్‌గా నయనతార పేరు వినిపిస్తుండగా, ఒకవేళ ఆమె డేట్స్ కుదరకపోతే త్రిషను ఫైనల్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. గతంలో మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’లో వందియదేవన్-కుందవై పాత్రల్లో అలరించిన కార్తీ-త్రిష కాంబోకి మంచి క్రేజ్ ఉండటంతో ఈ వార్త ఆసక్తికరంగా మారింది. కాగా, కుటుంబ నేపథ్యంతో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. మరోవైపు కార్తీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ‘సర్దార్ 2’ చేస్తుండగా, కళ్యాణ్ శంకర్ కాంబినేషన్‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ‘కార్తీ 30’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మోహన్ రాజా ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది

క ర త త స ట ర బ య ట త ర ష ఏ స న మ క సమ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in