కారుణ్య మరణాలకు ఏపీలో మార్గం సుగమం.. కొత్త మార్గదర్శకాలకు ప్రభుత్వ ఆమోదం
Actor ProfilePolitician

కారుణ్య మరణాలకు ఏపీలో మార్గం సుగమం.. కొత్త మార్గదర్శకాలకు ప్రభుత్వ ఆమోదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కారుణ్య మరణాలకు ఏపీలో మార్గం సుగమం.. కొత్త మార్గదర్శకాలకు ప్రభుత్వ ఆమోదం
Andhra Jyothy12 Oct 2026
కారుణ్య మరణాలకు ఏపీలో మార్గం సుగమం.. కొత్త మార్గదర్శకాలకు ప్రభుత్వ ఆమోదం

చివరి దశలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపిన తాజా మార్గదర్శకాలతో కారుణ్య మరణాలకు సంబంధించిన విధానానికి చట్టబద్ధమైన రూపం లభించింది. అమరావతి, జులై 8 (ఆంధ్రజ్యోతి): చివరి దశలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మార్గం సుగమం చేసింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపిన తాజా మార్గదర్శకాలతో కారుణ్య మరణాలకు సంబంధించిన విధానానికి చట్టబద్ధమైన రూపం లభించింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు (Supreme Court)ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్న చర్యగా ప్రభుత్వం పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, కోలుకునే అవకాశం లేని చివరి దశలో ఉన్న రోగుల విషయంలో నిర్దిష్ట నిబంధనలను అనుసరించి వైద్య బృందం, రోగి కుటుంబ సభ్యులు కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలు, వైద్య నిపుణుల అభిప్రాయాలు, రోగి హక్కులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి అంశాల్లో వైద్యులు, కుటుంబ సభ్యులు చట్టపరమైన సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొనేవారు. తాజా మార్గదర్శకాలతో నిర్ణయ ప్రక్రియకు స్పష్టత రావడంతో పాటు, చట్టబద్ధమైన రక్షణ కూడా లభించనుంది. దీనివల్ల వైద్య సేవల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు అవసరంలేని న్యాయపరమైన ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు స్పందించే అవకాశాలు లేని రోగుల కుటుంబాలకు ఈ నిర్ణయం కొంత ఊరటనిచ్చే అవకాశముంది. అయితే ప్రతి కేసును నిర్దేశిత నిబంధనల ప్రకారం పరిశీలించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుతో ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య మరణాలపై స్పష్టమైన విధానం అమల్లోకి రానుంది. సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు: పవన్ కల్యాణ్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన