
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. BEd Admission: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తి శిక్షణ కోర్సు అయిన బీఈడీకి మళ్లీ డిమాండ్ భారీగా పెరుగుతోంది. గత కొంతకాలంగా ఈ కోర్సులో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈసారి 13,695 సీట్లకు గాను.. మొదటి విడతలోనే 9,407 మంది అభ్యర్థులు సీట్లు దక్కించుకున్నారు. ఎడ్ సెట్ మొదటి విడత సీట్లను ఆదివారం కేటాయించగా.. మొత్తం కన్వీనర్ కోటాలో 13,695 సీట్లు ఉన్నాయి. అందులో ఈసారి 15,009 మంది వెబ్ ఆప్షన్స్ ఎంచుకున్నారు. వీరిలో 9,407 మది సీట్లను దక్కించుకున్నారు. సీట్లు దక్కించుకున్నవారు ఈనెల 20 వరకు ఫీజు చెల్లించి రిపోర్టు చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. కాగా 2025లో మొదటి విడతలో 4,474 మంది రిపోర్టు చేశారు. రెండో విడతలో 7,441 మంది సీట్లు దక్కించుకున్నారు. అంటే ఈ రెండు విడతల్లో 11వేలకు పైగా సీట్లు నిండిపోయాయి. ఈ సారి మొదటి విడతలోనే 9వేలకు పైగా సీట్లు భర్తీ అయ్యాయి. అంటే ఈ సారి 81.85 శాతం సీట్లను మహిళలే దక్కించుకున్నారు. కాగా జాతీయ విద్యా విధానంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఏడాది కాలపరిమితి గల బీఈడీ కోర్సును పున ప్రారంభించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మాస్టర్స్ డిగ్రీ లేదా నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు అవుతారు. సాధారణ మూడేళ్ల డిగ్రీ చదివిన వారికి ప్రస్తుతం ఉన్న రెండేళ్ల బీఈడీ కోర్సు యథాతథంగా కొనసాగనుంది. కాగా ఈ నూతన కోర్సుపై అభ్యర్థుల్లో భారీగా ఆసక్తి నెలకొంది