కుమారుడికి రామ్ చరణ్’ పేరు పెట్టిన అభిమాని.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశారో తెలుసా
Actor ProfilePolitician

కుమారుడికి రామ్ చరణ్’ పేరు పెట్టిన అభిమాని.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశారో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కుమారుడికి రామ్ చరణ్’ పేరు పెట్టిన అభిమాని.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశారో తెలుసా
TV9 Telugu30 Nov 2026
కుమారుడికి రామ్ చరణ్’ పేరు పెట్టిన అభిమాని.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశారో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. ఇక చిరంజీవి కూడా అభిమానులనే తన కుటుంబంగా భావిస్తారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఫ్యాన్స్ పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ‘మెగా 158’ షూటింగ్ సెట్స్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అదేంటంటే. ‘మెగా 158’ షూటింగ్ సమయంలో కెమెరా విభాగంలో నివాస్ అనే టెక్నీషియన్‌ పని చేస్తున్నాడు. ఇతను తన పనితీరుతో చిరంజీవితో పాటు అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో చిరంజీవి నివాస్ ను పిలిపించి సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలోనే నివాస్ వ్యక్తిగత విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నివాస్ తాను రామ్ చరణ్‌కు వీరాభిమానినని చెప్పడంతో పాటు.. చరణ్‌పై ఉన్న అభిమానంతో తన కుమారుడికి ‘జస్వంత్ రామ్ చరణ్’ అనే పేరు పెట్టినట్లు చిరంజీవికి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ ఎంతో సంబరపడిపోయారు. తన ఫ్యామిలీ పట్ల నివాస్ చూపిస్తున్నా అభిమానానికి పొంగిపోయారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నివాస్ కుటుంబాన్ని తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారిని ఘనంగా సత్కరించారు. చిరంజీవి ఇంటి కెళ్లిన నివాస్ కుటుంబ సభ్యులకు మరో సర్ ప్రైజ్ ఎదురైంది. అదేంటంటే.. మెగాస్టార్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నివాస్ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపారు. చిన్నారి జస్వంత్ ఆప్యాయంగా మాట్లాడారు. నివాస్ కుటుంబ సభ్యులతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ సాధారణ టెక్నీషియన్ కుటుంబానికి చిరంజీవి, రామ్ చరణ్ ఇచ్చిన గౌరవం, చూపించిన ఆత్మీయతపై ప్రశంసల జల్లు కురుస్తోంది. — The Cine Gossips (@TheCineGossips) August 9, 2026 మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి